ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించి రాజమౌళి ఈరోజు ఒక కీలక ప్రకటన చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈరోజు వెల్లడి కానున్న ఆ ప్రకటనలో జూనియర్ ఎన్టీఆర్ పక్కన నటించబోయే విదేశీ నటి పేరును అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

అమెరికాలో ధియేటర్ ఆర్టిస్ట్ గా పేరున్న ఓలివియా అనో ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈమె పెద్దగా పేరున్న నటి కాకపోయినప్పటికీ పేరున్న హాలీవుడ్ హీరోయిన్స్ ఎవరు ప్రస్తుతం రాజమౌళికి దొరకని పరిస్థితులలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

అంతేకాకుండా ఇప్పటికే ఈ మూవీలో అజయ్ దేవగన్ విలన్ గా ఎంపిక అయినప్పటికీ మరో విలన్ పాత్ర కోసం ఎంపిక అయిన విదేశీ నటుడు పేరును కూడ ఈరోజు ప్రకటించే ఆస్కారం ఉంది. అదేవిధంగా ఈ మూవీలో ఒక గిరిజిన యువతి పాత్ర చేస్తున్న నిత్యామీనన్ పేరును కూడ ఈరోజు ప్రకటిస్తారని తెలుస్తోంది.


వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ 60 శాతం వరకు పూర్తి అయినా ఈ మూవీకి సంబంధించిన చాల కీలక సన్నివేశాల షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉందని వార్తలు వస్తున్నాయి. దీనితో వచ్చే ఏడాది మే నెలాఖరు వరకు ఈ మూవీ షూటింగ్ కొనసాగే నేపధ్యంలో ఈ మూవీని అనుకున్న జూలై నెలలో కాకుండా మరో డేట్ కు విడుదలచేసే ఆలోచన రాజమౌళికి ఉన్నా ఆ విషయాన్ని ఇంత ముందుగా బయట పెట్టడం ఇష్టం లేక గుంభనంగా ఉన్నట్లు టాక్. అయితే ఈ మూవీని బాలీవుడ్ లో కూడ విడుదల చేస్తున్న పరిస్థితులలో రిలీజ్ డేట్ ను చాల ముందుగా ప్రకటించకపోతే సమస్యలు రావడమే కాకుండా అక్కడి బయ్యర్లు కూడ స్పష్టమైన క్లారిటీ అడిగే ఆస్కారం ఉంది. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ కీలక ప్రకటన గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: