రామ్ చరణ్ భార్య మెగాస్టార్ కోడలు ఉపాసన కొణిదెల ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ చెర్రీ గురించి చిరంజీవి గురించి ఎన్నో అప్డేట్ లను తరుచుగా ఇస్తూ ఉంటుంది. అయితే అపోలో లైఫ్ సంస్థ అధినేతగా ఉన్న ఉపాసన... గత కొంతకాలంగా యూట్యూబ్ వేదికగా ఆరోగ్యం గురించి ఎన్నో విషయాలను సామాన్య ప్రజలకు తెలియజేస్తుంది. చిరంజీవి లాంటి ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి వాళ్ళు పాటించే ఆరోగ్య సూత్రాలను ఆమె యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేసి ఎంతో మంది ఫాలోయర్స్ ను సంపాదించింది. తన ఇంస్టాగ్రామ్ లో ఫిట్నెస్ కు సంబంధించిన ఎన్నో వీడియోలు అప్లోడ్ చేస్తూ ప్రజలకు ఎన్నో చిట్కాలను అందిస్తుంది. ఇదిలా ఉంటే... ఆరోగ్య సూత్రాలను, ఫిట్నెస్ కు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు మరింత తెలియపరిచే విధంగా ఒక వెబ్సైటును ఆమె మొదలుపెట్టింది. 

 

అయితే ఈ వెబ్సైట్ లో ఆరోగ్యానికి సంబందించిన ఆర్టికల్స్ ను రాయడానికి కంటెంట్ రైటర్స్ కావాలనే ప్రకటనను ఆమె తాజాగా విడుదల చేసింది. కమ్యూనికేషన్ స్కిల్స్ కచ్చితంగా ఉండాలని, అర్హతలు ఉన్నవారు upasana@apollolife.comకు రెస్యూమ్, సర్టిఫికెట్ కాపీలు, పోర్ట్‌ఫోలియో, చేతి రాత ఫోటో తీసి పంపాలని సూచించారు. ప్రతి బుధవారం అపోలో లైఫ్‌లో జాబ్స్‌కు సంబంధించిన వివరాలు ప్రకటిస్తానని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ జాబ్ కి సంబంధించిన అర్హతలను పొందుపరిచారు. 

 

రామ్ చరణ్ ని వివాహం చేసుకున్న తర్వాత ఉపాసన కామినేని కొణిదెల ఏకంగా 14 కిలోల బరువును తగ్గారు. అప్పటినుంచి..ఆమె సామజిక కార్యక్రమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు బాగా దగ్గరవుతుంది. ఇతర సెలబ్రిటీస్ లాగా కాకుండా కేవలం ప్రజల ఆరోగ్యం కోసమే ఇంస్టాగ్రామ్ లో వీడియోలు అప్లోడ్ చేస్తున్న ఉపాసన ని నెటిజన్లు కొనియాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: