ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా బిజీలో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా 70% వరకు పూర్తయింది.  ఇందులో ఎన్టీఆర్ కు జోడిగా బ్రిటిష్ యువతి మోరిస్ నటిస్తోంది.  ఇక ఇదిలా ఉంటె, ఎన్టీఆర్.. పూరి కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి.  అందులో ఒకటి ఆంధ్రావాలా కాగా రెండో సినిమా టెంపర్.  ఆంధ్రావాలా ప్లాప్ కాగా, టెంపర్ బంపర్ హిట్ అయ్యింది.  టెంపర్ సినిమా తరువాత ఎన్టీఆర్ కు అన్ని వరసగా విజయాలు సాధిస్తూ వస్తున్నాడు.  


టెంపర్ లో ఎన్టీఆర్ ను చూపించిన విధానం అద్భుతంగా ఉంటుంది.  ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ కోసం పూరి ఓ కథను రాసుకున్నాడట.  కానీ, ఆ సినిమా ఎందుకో సెట్స్ మీదకు వెళ్ళలేదు.  పూరి - ఎన్టీఆర్ అనుకున్న కథలో ఎన్టీఆర్ కు నత్తి ఉంటుంది.  మాటలను సరిగ్గా పలకలేడు.  ఇదే విధమైన కాన్సెప్ట్ తో ఎన్టీఆర్ జై లవకుశ సినిమా చేశారు.ఇందులో ఒక ఎన్టీఆర్ కు నత్తి ఉంటుంది.  ఆ పాత్రకు ఎన్టీఆర్ ప్రాణం పోశారు.  


జైలవకుశ తరువాత ఎన్టీఆర్ పై పూరి మండిపడిన సంగతి తెలిసిందే.  తన ఫార్ములాను కాపీ కొట్టారని అన్నారు. ఎన్టీఆర్ కాపీ కొట్టాడో లేదో తెలియదుగాని, దీనిపై మాత్రం అప్పట్లో మీడియాలో హడావుడి చేశారు.  కాగా, పూరి.. విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయబోతున్నారు.  దీనికి ఫైటర్ అనే పేరును పెట్టారు.  ఈ పేరుతో సినిమా చేస్తున్నారట.  జనవరి నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.  


ఈ ఫైటర్ లో హీరోకు నత్తి ఉంటుంది.  హీరో నత్తిగా మాట్లాడుతూ.. హీరోయిజం చూపిస్తుంటాడట. ఎన్టీఆర్ కోసం తయారు చేసుకున్న కథతోనే ఫైటర్ ను తీస్తున్నారని అంటున్నారు.  పూరితో సింగిల్ సిట్టింగ్ తోనే కథను ఒకే చేశారని వార్తలు అందుతున్నాయి.  ఎన్టీఆర్ ఎందుకు ఈ సినిమా చేయలేదో.. విజయ్ ఎందుకు చేస్తున్నారో తెలియాలంటే మాత్రం ఈ ఫైటర్ రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: