ఒకప్పుడు మత బోధకుడిగా ఉన్న కేఏ పాల్ కొద్ది కాలం క్రితం ఎవ్వరికి కనిపించకుండా చాలా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు.  ఇటీవల ఏపిలో జరిగిన ఎన్నికల్లో ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు.  ప్రజాశాంతి పార్టీ తరుపున ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు.  తన తరుపు నుంచి అభ్యర్థులను కూడా పోటీలో దించారు.  ఇక ప్రచార కార్యక్రమాల్లో కేఏ పాల్ చేసిన అతి అంతా ఇంతా కాదు.  

 

టీడీపీ, వైసీపీ, జనసేన ఇతర పార్టీలు ప్రజాశాంతి ముందు మట్టి కరిచి పోతాయని.. సైకిల్ కి పంచర్, ఫ్యాన్ రెక్కలు విరిగిపోతాయ్, గ్లాస్ పగిలిపోతుందని కామెంట్స్ చేస్తూ కాబోయే సీఎం తాను అంటూ మీడియాలో దుమ్మురేపారు.  ఒక్క మూడు నెలలు మాత్రం సోషల్ మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు కేఏపాల్.  ఇక ఎన్నికలు జరిగాయి..కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా కనుమరుగయ్యారు.  ఆ తర్వాత ఎన్నికల్లో ఎన్నో మోసాలు జరిగాయని ఈసీకి ఫిర్యాదు చేస్తానని మరోసారి తెరపైకి వచ్చారు. అయితే ఏపిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మళ్లీ మీడియా కంట పడలేదు కేఏపాల్.  

 

తాజాగా మరోసారి తెరపైకి వచ్చారు..ఈసారి రాజకీయ పరంగా కాదు..రామ్ గోపాల్ వర్మ తాజా మూవీ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'పై మరో కేసు దాఖలైంది. ఈ సినిమాలో తన క్యారెక్టర్ ను అవమానించేలా చూపించారంటూ క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్, హైకోర్టును ఆశ్రయించారు.  ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఓ కమెడియన్ తో వేయించారని..బఫూన్ లా చూపించారని.. ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని కోరుతూ, పిటిషన్ ను దాఖలు చేశారు. 

 

ఇక ఈ కేసులో ప్రతివాదులుగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ, సెన్సార్ బోర్డు, రామ్ గోపాల్ వర్మ, జబర్దస్త్ కమేడియన్ రాము తదితరులను చేర్చారు.  మొదటి నుంచి  'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' పై ఎన్నో కాంట్రవర్సీలు వస్తూనే ఉన్నాయి.  ఈ మూవీలో పప్పు సాంగ్ పై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. తాజాగా కేఏ పాల్ వేసి పిటిషన్ పై నేటి మధ్యాహ్నం తరువాత హైకోర్టులో విచారణ జరుగనుందని సమాచారం. ఇదిలా ఉంటే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' మూవీ ఈ నెల 29న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: