టాలీవుడ్ యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం రూలర్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ లు గా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు ఘోరంగా ఫ్లాప్ కావడంతో, కొంత ఆలోచనలో పడిన బాలకృష్ణ, చివరకు గత ఏడాది తనకు జైసింహా వంటి హిట్ మూవీ ని అందించిన కేఎస్ రవికుమార్ తో సినిమా చేయడానికి నిశ్చయించి రూలర్ సినిమాను మొదలెట్టడం జరిగింది. నందమూరి ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాలో సోనాల్ చౌహన్, 

 

వేదిక హీరోయిన్స్ గా నటిస్తుండగా భూమిక ఒక ముఖ్యపాత్రలో నటిస్తోంది. చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు సి రామ్ ప్రసాద్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి బయటకు వచ్చిన బాలయ్య పోలీస్ ఆఫీసర్ లుక్స్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టాయి. ఇకపోతే నేడు ఈ సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. బాలయ్య, ధర్మ అనే పవర్ఫుల్ మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఈ సినిమా టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. టీజర్ లో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఫైట్స్, యాక్షన్ సీన్స్ అదరగొట్టాడు అనే చెప్పాలి. 

 

మంచి యాక్షన్ సీన్స్ తో పాటు పవర్ఫుల్ డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నందమూరి ఫ్యాన్స్ ని అలరించేలా సాగిన ఈ టీజర్ రిలీజ్ తరువాత సినిమాపై అమాంతం అంచనాలు పెరిగాయి. ఇక ప్రస్తుతం యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతున్న ఈ టీజర్ పై నందమూరి ఫ్యాన్స్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే రెండు వరుస అపజయాలతో ఢీలా పడ్డ బాలయ్య, ఈ సినిమాతో ఎంత మేర సక్సెస్ ని అందుకుంటారో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: