భారతీయ దిగ్గజ దర్శకుడు 'బాహుబలి' సినిమా తో భారతీయ చలన చిత్ర రంగం దమ్ము ఏంటో ప్రపంచ సినిమా రంగానికి తెలియజేసిన ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో 'RRR' సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన వార్తలు ఇంటర్నెట్లో మరియు సోషల్ మీడియాలో ఫిలింనగర్ లో బాగా వైరల్ అవుతున్నాయి. సినిమా మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు సినిమాకి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలలో సరైన అప్డేట్ ఇప్పటివరకు బయటకు రాని నేపథ్యంలో తాజాగా నందమూరి మరియు మెగా అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చే విధంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ మరియు మెయిన్ విలన్ అలాగే లేడీ విలన్ వంటి విషయాలకు సంబంధించి ఇటీవల వివరణ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే 'RRR' సినిమా లో నటిస్తున్న వీరి వివరాలు వీరి పేర్లు సినిమా యూనిట్ ప్రకటించడంతో ప్రస్తుతం వీరికి ఇంటర్నెట్లో అదిరిపోయే ఆదరణ దొరుకుతుంది.

 

జూనియర్ ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిన ఒలీవియా ట్విట్టర్ ఫాలోవర్స్ అయితే ఒక్కసారిగా పెరిగిపోయారు. వందల ఫాలోవర్స్ పదిహేను వేలు దాటేశారు. థియేటర్ ఆర్టిస్ట్ గాఉన్న ఒలీవియా మోరిస్ RRRలో నటిస్తోంది అనగానే ట్విట్టర్ ఫాలోవర్స్ 400 నుంచి 17,000కు పెరిగిపోయారు. గూగుల్ టాప్ సెర్చ్ లిస్ట్ లో ఒలీవియా పేరు ఉండడం విశేషం. బేబీకి ఒక్కసారిగా పిచ్చ ఫాలోయింగ్ వచ్చిందనే చెప్పాలి. ఇక విలన్ పాత్రలో కనిపించనున్న థార్ యాక్టర్ రే స్టీవెన్సన్ కి కూడా ఇండియాలో మంచి ఫాలోయింగ్ పెరుగుతోంది.

 

'RRR' నటిస్తున్నారు అనగానే ఒక్కసారిగా వీరి పేర్లు హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఈ సినిమా ఇటీవల షూటింగ్ హీరోలా గాయాల కారణంగా ఆగడంతో ప్రస్తుతం ఎలాగైనా అనుకున్న సమయానికి వచ్చే ఏడాది జులై మాసం చివరి కల్లా విడుదల చేయాలని డైరెక్టర్ రాజమౌళి పక్క షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారం.   

మరింత సమాచారం తెలుసుకోండి: