ఈ కాలంలో సినిమాలు తీయడం చాలా ఈజీ. ప్రతీ ఒక్కరూ సినిమాలు తీసేస్తున్నారు. మంచి కథ ఉండి సినిమాకి సరిపడా ఎక్విప్ మెంట్ ఉంటే సినిమా తీసేస్తున్నారు. అయితే సినిమాలు తీసేది ప్రేక్షకులకు చూపించడానికే కాబట్టి వాటిని థియేటర్లో విడుదల చేయాల్సి ఉంటుంది. ఇక్కడే అసలు సమస్య వస్తుంది. చాలా మంది సినిమా తీసేస్తారు. కానీ ఎలా విడుదల చేయాలో తెలియదు. థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది.

 

అన్ని కుదిరి థియేటర్లు దొరికితే, ప్రేక్షకులను సినిమా చూడ్డానికి రప్పించాలంటే ప్రమోషన్ ఖచ్చితంగా అవసరం. థియేటర్లో విడుదల చేయగానే సినిమా చూడడానికి జనాలు ఎగబడి కాలం పోయింది. ఎందుకంటే ప్రేక్షకులకి ఆప్షన్స్ ఎక్కువైపోయాయి. ఈ సినిమా కాదంటే మరో సినిమా చూసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో మనం తీస్తున్న సినిమాలో విషయం ఉందని తెలిసేలా ప్రమోషన్లు చేయాలి.

 

అలాంటి ప్రమోషన్లలో భాగంగానే "బీచ్ రోడ్ చేతన్" టీమ్ కొంచెం విభిన్నంగా ఆలోచించి మొదటి రోజు మార్నింగ్ షో టికెట్లను ఫ్రీగా ఇచ్చింది. ఇలా చేయడం వల్ల సినిమా చూడడానికి ఎక్కువ జనాలు వస్తారు కాబట్టి తమ సినిమాకి మంచి ప్రమోషన్ వస్తుందని భావించారు. చిత్ర యూనిట్ అనుకున్న విధంగానే ఈ సినిమాకి మొదటి రోజు మార్నింగ్ రోజు విశేష స్పందన వచ్చింది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.

 

రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయని తెలుస్తుంది. ప్రతి ధియేటర్ వద్ద నుండి మూడు నుండి నాలుగొందల మంది టికెట్స్ దొరక్క నిరాశతో తిరిగి వెళ్లిపోతున్నారని తెలుస్తుంది. ఈ మేరకు సినిమా బాగుంటే వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అదే జరిగితే బీచ్ రోడ్ చేతన్ అనుకున్నది సాధించినట్టే. మరి అలా జరుగుతుందా లేదా చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: