సోనాల్ చౌహాన్ తెలుగులో మళ్ళీ మెరుస్తోంది. వచ్చే నెలలో రాబోతున్న  రూలర్ సినిమాలో బాలయ్యకు జోడీగా జత కట్టింది. ఈ ముద్దు గుమ్మకు ఇది బాలయ్యతో హ్యాట్రిక్ మూవీ. సోనాల్ చౌహాన్ అపుడెపుడో రెయిన్ బో  మూవీ ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చినా కూడా ఆ సినిమా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. ఇక సీన్ సితారే అనుకుంటున్న టైంలో బాలయ్య మూవీ లెజెండ్ తో చాన్స్ దక్కింది. ఇక అంతే ఆమెని బాలయ్య వదలడంలేదు.

 

సోనాల్ చౌహాన్ ని ఆ మధ్య వచ్చిన డిక్టేటర్ మూవీలో కూడా బాలయ్య ఓ ఐటం సాంగ్ లో తీసుకున్నాడు. ఆ సాంగ్ లో అందాలను అలా  ఆరబోసిన సోనాల్ తరువాత మళ్ళీ కనిపించలేదు. ఇపుడు రూలర్ మూవీతో  వస్తోంది. ఇందులో బాలయ్య పెయిర్ గా మెయిన్ లీడ్ రోల్ లో కనిపిస్తున్న సోనాల్ తాజాగా విడుదల అయిన టీజర్ లో తన అందాలతో మోతెక్కించింది. 

 

తడిసిన అందాలతో బికినీతో సొనాల్ బంగారంలా మెరిసిపోతోంది. దాంతో ఈ మూవీ లో సోనాల్ గ్లామర్ షో గట్టిగానే ఉందని అంటున్నారు. సోనాల్ చౌహాన్ తో బాలయ్య కెమిస్ట్రీ వర్కౌట్ కావడంతో ఆమె ఎక్కడా దాచకుడా సొగసు సెగలను పుట్టించిందని అంటున్నారు. ఈ సినిమా పక్కా మాస్ మసాలాగా ఉన్నా కూడా సోనాల్ చౌహాన్ అందల‌తో కుర్ర కారుకి కేక పుట్టించే సీన్లు  బాగానే ఉంటాయని అంటున్నారు.

 

ఇక సోనాల్ చౌహాన్ ని రూలర్ తరువాత కూడా  బాలయ్య  వదలాలనుకొవడం లేదుట. ఆయన బోయపాటి శ్రీను  కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీలో ఒక హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ని పెట్టమని సిఫార్స్ చేసినట్లుగా న్యూస్ వైరల్ అవుతోంది. అంటే సోనాల్ బాలయ్య పెయిర్ అప్పట్లో విజయశాంతి, రోజాల తరువాత  మళ్ళీ టాప్ అనిపిస్తోందని నందమూరి అభిమానులే అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: