‘బాహుబలి’ లాంటి భారీ విజయం తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి ఊహించని విధంగా దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ప్రభాస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పై అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు..ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన ఈ సినిమా కచ్చితంగా మరో బాహుబలి సినిమా అవుతుందని అందరూ భావించారు సినిమా ట్రైలర్  చూసి. భారీ యాక్షన్ సన్నివేశాలు టైలర్ లో హాలీవుడ్ స్థాయిలో చూపించడంతో అంతేకాకుండా సినిమా కోసం ప్రభాస్ ఏకంగా రెండు సంవత్సరాల టైం కేటాయించడంతో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని సినిమా హాల్ కి వెళ్ళిన ప్రభాస్ అభిమానులు మొట్టమొదటి బెనిఫిట్ షోకి దారుణమైన ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.

 

దీంతో సాహో సినిమా పై సోషల్ మీడియాలో ఇతర స్టార్ హీరోల అభిమానులు ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రేక్షకులు ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. దీంతో తాజాగా ఇంటర్నెట్ చరిత్రలో సరికొత్త పేరు సంపాదించుకుంది సాహో సినిమా. విషయంలోకి వెళితే ట్రోల్ ర్యాంకింగ్ లో సాహో చిత్రం ర్యాంక్ మూడు. స్టూడెంట్ అఫ్ ది ఇయర్ 2 బాలీవుడ్ చిత్రం మొదటి స్తానం లో వుంది. ఆ తరువాత రెండో స్థానంలో కళంక్ వున్నది, ఆ తరువాత మన తెలుగు సినిమా అయినా సాహో చిత్రం.

 

దీంతో ప్రభాస్ అభిమానులు మరియు తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రేక్షకులు సాహో సినిమా ఇంతగా ట్రోల్ అవ్వడం పట్ల చాలా కలవరపడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ జిల్ ఫేమ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ ప్రేమకథ సినిమాలో నటిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: