'భరత్ అనే నేను', 'మహర్షి' లాంటి రెండు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ విజయాలు వరుసగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కొట్టడంతో మహేష్ బాబు హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి కమర్షియల్ ఎంటర్ టైనర్ రూపంలో అభిమానులను అలరించడానికి అనిల్ రావిపూడి దర్శకత్వం లో 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా చేస్తున్నారు.  రాబోయే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతున్న ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల అయ్యింది సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేస్తుంది. ఇదిలా ఉండగా సినిమాలో నిర్మాణ భాగస్వామ్యంలో కూడా మహేష్ తన చెయ్యి వేయటంతో 'సరిలేరు నీకెవరు' సినిమా కోసం మహేష్ బాబు త్యాగాలు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినపడుతున్నాయి.

 

విషయంలోకి వెళితే ఈ సినిమా కోసం మహేష్ బాబు రెమ్యునరేషన్ పరంగా 50 కోట్లు తీసుకుంటున్నట్లు స్టార్టింగ్ లో వార్తలు వచ్చాయి. అదేవిధంగా నిర్మాణ భాగస్వామ్యంలో అనిల్ సుంకర సరే నిర్మాత మహేష్ బాబు నాన్ థియేట్రికల్ రైట్స్ ఇవ్వటానికి కూడా అప్పట్లో సిద్ధమైనట్లు ఇండస్ట్రీలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా పరిస్థితి చూస్తే నాన్ థియేట్రికల్ రైట్స్ అంచనా వేసినంత రేంజ్ లో రావడం లేదని సమాచారం. హిందీ డబ్బింగ్ రైట్స్ లోనే అంచనా వేసుకున్న దానికంటే కనీసం ఏడు కోట్లు తక్కువ పలికిందట. అలానే ఇతర హక్కుల పరంగా కూడా మునుపటి ధరలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని టాక్. థియేట్రికల్ రైట్స్ నుండి నిర్మాతకి మిగిలే లాభాలు కూడా పెద్దగా ఉండవని చెబుతున్నారు.

 

సినిమా మేకింగ్ కోసమే యాభై కోట్లు అనుకున్నారు. కానీ తీరా సెట్స్ పైకి వెళ్లిన తరువాత ఖర్చు విపరీతంగా పెరిగిపోవడంతో అనుకున్న బడ్జెట్ దాటేసింది. దీంతో మహేష్ కి వస్తుందని అంచనా వేసిన మొత్తం యాభై రెండు కోట్లయితే.. ఇప్పుడు కచ్చితంగా ఇవ్వలేరని సమాచారం. మొత్తం మీద ఈ పరిణామంతో రెమ్యూనరేషన్ల వరం మహేష్ కి వచ్చే లాభాలలో కొంచెం కోత పడటం గ్యారెంటీ అనే టాక్ వినపడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: