నిన్న విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ మహేష్ అభిమానులకు విపరీతంగా కనెక్ట్ కావడంతో ఈ టీజర్ మ్యానియా తారా స్థాయిలో కొనసాగుతోంది. ఈ సినిమా టీజర్ ఈ రేంజ్ లో దూసుకు పోతుంటే మహేష్ ఈ మూవీ బిజినెస్ అంచనాలలో వేసిన తప్పటడుగు ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

ప్రస్తుతం టాప్ హీరోలు అందరు తాము నటించే సినిమాలకు పారితోషికం తీసుకోకుండా ఆ సినిమా బిజినెస్ లో షేర్ తీసుకుంటున్నారు. దీనితో చాలామంది టాప్ హీరోలు తమ పారితోషికంగా నాన్ థియేట్రికల్ రైట్స్  ద్వారా వచ్చే ప్యాకేజ్ ని తమ పారితోషికంగా అడుగుతున్నారు. 

ఇదే పద్ధతి మహేష్ కూడ ‘సరిలేరు నీకెవ్వరు’ విషయంలో అనుసరించి తనకు 50 కోట్ల వరకు పారితోషికంగా వస్తుదని ఆశించాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ శాటిలైట్ డిజిటల్ రైట్స్ కు సంబంధించిన ఆదాయం ముఖ్యంగా ఈ మూవీ హిందీ డబ్బింగు రైట్స్ కు అనుకున్న స్థాయిలో రేటు రాకపోవడంతో ఈ విషయంలో మహేష్ అంచనాలకన్నా 8 కోట్లు ఆదాయం తగ్గింది అన్న వార్తులు వస్తున్నాయి. 

అంతేకాదు ఈ మూవీకి సంబంధించి డిజిటల్ ఛానల్ రైట్స్ లో కూడ మహేష్ కోరుకున్న స్థాయిలో బిజినెస్ జరగక పోవడంతో ఈ నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా తాను ఆశించిన ఆదాయంలో సుమారు 25 శాతం వరకు తగ్గింది అన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది విడుదలైన భారీ సినిమాలు ‘సాహో’ ‘సైరా’ లు ఆశించిన స్థాయిలో విజయవంతం అవ్వకపోవడంతో ఈ నాన్ థియేట్రికల్ రైట్స్ పై మహేష్ అంచనాలు తప్పి తాను కోరుకున్న 50 కోట్ల ప్యాకేజ్ ని అందుకోలేకపోయాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో రానున్న రోజులలో టాప్ హీరోలు తమ వంతు షేర్ గా ఇలా నాన్ థియేట్రికల్ రైట్స్ తీసుకునే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితులు ఏర్పడినా ఆశ్చర్యం లేదు అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు..     

మరింత సమాచారం తెలుసుకోండి: