అమ్మాయిల పై వేధింపులు చాలా సహజం అయ్యిపోయాయి. వాళ్లు ఎంత పెద్ద రంగంలో ఉన్న.... ఎవరో ఒకరు వారిని వేధిస్తూనే ఉన్నారు. లక్షల మంది పోలీసులు ఉన్న. . ఎన్ని షీ టీమ్లు ఉన్న ఆడవారిని మాత్రం పూర్తిగా ఎవరు కాపాడలేక పోతున్నారు. ప్రస్తుతం మలయాళ, కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా నటించి.... ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులను అందుకున్న పార్వతిని 'అడ్వకేట్ కిషోర్' అనే వ్యక్తి వేధిస్తున్నాడు. కొన్ని నెలల నుంచి సోషల్ మీడియా ద్వారా ఆమెకు నరకం చూపిస్తున్నాడు. 2 నెలల నుంచి మాత్రం నేరుగా ఆమె ఇంటికే వచ్చి తన ఫ్యామిలీని కూడా వేధించడంతో.. ఆ బాధలు తట్టుకోలేక చివరికి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది ఈ కన్నడ భామ. దీంతో తక్షణమే స్పందించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

వివరాల్లోకి వెళితే... తనను ఒక లాయర్ గా చెప్పుకున్న కిషోర్.. పార్వతి సోదరుడికి ఫోన్ చేసి.. "మీ సోదరి ప్రమాదంలో ఉంది.. కొంతమంది దుండగులు 'కొచ్చి' సిటీలో మీ పార్వతికి హామీ చేయబోతున్నారు" అని చెప్పాడు. కానీ ఆ సమయంలో నటి పార్వతి అమెరికాలో ఉంది. కొంత సమయం తర్వాత..ఆమె సోదరుడు కిషోర్ విషయం గురించి పార్వతికి చెప్పాడు. పార్వతితో రొమాంటిక్ రిలేషన్ లో ఉన్నానంటూ ఆమె సోదరుడికి వందల మెసేజ్ లు పంపించాడు కిషోర్. దాంతో విసుకోపోయిన ఆ సోదరుడు.. కిషోర్ మెసేజ్ లకు స్పందించడం మానేసాడు. అప్పటితో ఆగని కిషోర్.. పార్వతి నాన్నని కూడా టార్గెట్ చేసాడు. ఆయన కూడా కిషోర్ ని పట్టించుకోకపోతే... అక్టోబర్ 14వ తారీఖున నేరుగా పార్వతి వాళ్ళ ఇంటికి వచ్చేసాడు. ఆ రోజు నుంచి పార్వతికు ఏదో హాని జరుగుతుందని.. అది చెప్పడానికే మీ ఇంటికి వస్తున్నానంటూ పార్వతి వాళ్ళ నాన్నకు చాలా మెసేజ్స్ పంపించాడు. గత 2 నెలలుగా డైలీ కిషోర్ తన కుటుంబాన్ని వేధిస్తుండటంతో... ఇక లాభంలేదనుకున్న నటి.. పోలీసులు పిర్యాదు చేసింది.


సెక్షన్ 354 డి, కేరళ పోలీసు చట్టం 120-ఓ (విసుగు కలిగించినందుకు జరిమానా) కింద ఈ కేసు నమోదు చేసామని తెలిపారు పోలీసులు. 2017లో ఇర్ఫాన్ ఖాన్ నటించిన ఖరీబ్ ఖరీబ్ సింగిల్ చిత్రంతో హిందీ చిత్రానికి అడుగుపెట్టిన పార్వతి.. ఆ తర్వాత తమిళ, కన్నడ చిత్రాలలో కూడా నటించింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండుసార్లు ఉత్తమ నటి అవార్డును అందుకుంది ఈమె.

మరింత సమాచారం తెలుసుకోండి: