స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమా నుండి ఇప్పటివరకు వచ్చిన 3 సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అందులో ముఖ్యంగా సామజవరగమన సాంగ్ మాత్రం సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే 1 మిలియన్ లైస్ తో యూట్యూబ్ షేక్ చేస్తున్న ఈ సాంగ్ వరల్డ్ వైడ్ గా దుమ్ముదులిపేస్తుంది.   

 

సామజవరగమన సాంగ్ సిద్ శ్రీరాం పాడగా.. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించడం జరిగింది. థమన్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. రిలీజైన దగ్గర నుండి ఈ సాంగ్ ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. సినిమాలో ఈ సాంగ్ ఎలా ఉంటుందో కాని ఈ సాంగ్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తుంది.

 

కేవలం ఇండియాలోనే కాదు పాకిస్తాన్ లో కూడా ఈ సాంగ్ సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. పాక్ మ్యూజిక్ లవర్స్ ఈ సాంగ్ గురించి డిస్కస్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు సినిమా సాంగ్ గురించి పాక్ లో చర్చ జరగడం అంటే అల్లు అర్జున్ క్రేజ్ ఎక్కడిదాకా వెళ్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన హాట్ బ్యూటీ పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.

 

సీనియర్ హీరోయిన్ టబు కూడా ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు. నా పేరు సూర్య తర్వాత బన్ని చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సామజవరగమన సాంగ్ తో పాటుగా తర్వాత వచ్చిన రాములో రాములా.. ఓ మై గాడ్ డ్యాడీ సాంగ్స్ కూడా అలరించాయి. సినిమా జనవరి 12, 2020 రిలీజ్ అన్నారు కాని రిలీజ్ విషయంలో మరోసారి చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: