నయనతార తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరో లాంటి  స్టేటస్ ను సంపాదించింది.  నయనతారకు తక్కువ కాలంలోనే భారీగా అభిమానులు పెరిగినారు. దీనితో తెలుగులో కూడా నయనతార నటించడానికి పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. అయితే  నయన్ నటించిన హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ `మాయ` తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తాజాగా తను నటించిన మరో సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ తెలుగులో `వసంతకాలం` పేరుతో రిలీజవుతోంది. 5 కలర్స్ మల్టీమీడియా పతాకంపై  దామెర విఎస్ఎస్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో భూమిక ఓ కీలక పాత్రను పోషిస్తోంది. ఈనాడు - బిల్లా 2 చిత్రాల దర్శకుడు చక్రి తోలేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తమిళంలో రిలీజైంది. తెలుగు అనువాదం రెడీ అవుతోంది.

 

అన్ని హర్రర్ సినిమాల మాదిరిగా ఇది కూడా అదే విధంగా ఉందని తెలుస్తుంది. తాజాగా ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ ఆద్యంతం సస్పెన్స్ .. హారర్ .. థ్రిల్ యథావిధిగానే పాత వాసనలతోనే కనిపిస్తున్నాయి. అన్ని హారర్ థ్రిల్లర్ల లానే .. కథాంశం పరంగా కొత్తగా చెప్పుకోవడానికేం లేదు. దూరంగా ఓ ఒంటరి భవంతి... భవనం ముందు గార్డెన్.. ఆ ఇంట్లో ఏవో అవాంచిత ఘటనలు.. హత్య.. ముసుగు మనిషి.. ఏవేవో ఊహించని సంఘటనలు ..భయం.. థ్రిల్.. ఇదంతా రొటీన్ గానే ఉంది.

 

కానీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ నయనతార అని చెప్పొచ్చు. అయితే ఇందులో నయనతార నటిస్తోంది అన్నదే ఆసక్తికరమైన పాయింట్. యువన్ శంకర్ రాజా లాంటి ట్యాలెంటెడ్ సంగీత దర్శకుడు రీరికార్డింగ్ పెద్ద ప్లస్ కానుంది. తమిళంలో అంతంత మాత్రంగానే ఆడిన ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అన్ని థ్రిల్లర్లలానే రొటీన్ సంఘటనలు.. స్క్రీన్ ప్లేతో చూపిస్తే ఇదో సాధాసీదా సినిమాగానే నిలుస్తుంది. మన ఆడియెన్ ని ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. ఈ చిత్రంలో ప్రతాప్ పోతన్- రోహిణి హట్టాంగుడి ఇతర ముఖ్యపాత్రల్లో కనిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: