నిజం చెప్పుకోవాలంటే.. పొట్టకూటి కోసం కష్టపడే ఎంతో మంది కమెడియన్లకు మంచి భవిష్యత్తునిచ్చింది జబర్దస్త్ కామెడీ షో. 2013వ సంవత్సరం నుంచి ప్రారంభమైన జబర్దస్త్ షో గురించి.. స్వయంగా కమెడియన్ల మాట్లాడుతూ జబర్దస్త్ నా తల్లి, జబర్దస్త్ నా తండ్రి నాకు మంచి జీవితాన్ని ప్రసాదించింది అంటూ ఎంతో ఏడ్చారు. అసలు అన్నం దొరకడానికి కష్టమైన చాలామంది కమెడియన్లు.. ఇప్పుడు మంచిగా ఇల్లు కట్టుకొని లక్సరీ లైఫ్ నీ అనుభవించడానికి కారణం కేవలం జబర్దస్త్ మాత్రమే. కానీ ఇంకొక ప్రముఖ ఛానల్ కామెడీ షో ని ప్రారంభించగానే,...ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదా అంటూ వేరే షోకు మకాం మర్చి జీవితాన్నిచ్చిన జబర్దస్త్ షో గురించి చులకనగా మాట్లాడుతున్నారు. ఇది చాలా బాధాకరం. 

 

ఈటీవీ లో బాగా పాపులర్ అయిన జబర్దస్త్ షో ని చంపేసి, డాన్స్ షో ఢీని చిదిమేసి, పటాస్ షో ని ఏకంగా పీకేసి.... జి చానల్ వాళ్లు నాగబాబు తో కలిసి ఆటలు ఆడుతున్నారు. కానీ జబర్దస్త్ షో నిర్వాహకుల ముందు వీరి ఆటలు సాగుతాయా? రామోజీరావు తలుచుకుంటే వీరి భవిష్యత్తు ఏమిటో వీరికే ఊహించలేనంత దారుణంగా తయారవుతోంది. అవునండి! మేం చెప్పేదంతా నిజం. ఎందుకంటే.. "చెప్పుతో కొట్టుకుంటే చెమ్డాలే ఊడతాయిరా… సెక్షన్‌తో పెట్టుకుంటే చెడ్డీలు ఊడదీసేసి చెడుగుడు ఆడుకుంటాం… ముగ్గులో కూర్చోబెట్టి కొడతార్రా… సెక్షన్‌తో కొడతా"…………. శశిరేఖ పరిణయం అనే సినిమాలోని ఈ డైలాగ్ను మల్లెమాల ప్రొడక్షన్ హౌస్, రామోజీరావు బాగా ఆచరణలో పెట్టారు కాబట్టి. 

 

ఇక్కడ హాస్యం ఏంటంటే.. జబర్దస్త్ షో నిర్వాహకులు... సుడిగాలి సుదీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, నాగబాబు ఫేవరెట్ కమెడియన్ హైపర్ ఆది, ఇంకా ఇతర హాస్య నటులతో కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. ఈ కాంట్రాక్టు సమయం ఇంకా పూర్తి అవ్వలేదు. మెగా బ్రదర్ నాగబాబు కుదుర్చుకున్న కాంట్రాక్టు సమయం అయిపోయిన తర్వాత అతను జీటీవీ లోకి జంప్ అయ్యాడు. కానీ రోజా కాంట్రాక్టు సమయం ఇంకా మిగిలి ఉండటంతో ఆమె వేరే షో లోకి వెళ్లడం లేదు.

 

జీ టీవీ వాళ్ళు విడుదల చేసిన గ్యాంగ్ స్టార్స్(ఇప్పుడు లోకల్ గ్యాంగ్స్) షో ప్రోమోలో కనిపించిన సుడిగాలి సుధీర్, హైపర్ ఆది..... శనివారం, ఆదివారాల్లో ప్రసారమైన జీటీవీ రెండు ప్రత్యేక షోలలో {(1) లోకల్ గ్యాంగ్స్ 2) సరె, సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం)} కనిపించలేదు. దీనికి కారణమేంటంటే.... ఈటీవీ వాళ్లు ఈ కామెడియన్లను సెక్షన్ తో కొడతామనడమే. దాంతో... పాపం ఈ కమెడియన్ల పరిస్థితి అయోమయంగా.. భయంభయంగా మారిపోయిందట. ఒకవేళ సుధీర్ వాళ్లు నిజంగానే మకాం మార్చినట్లైతే జీ టీవీ రెండు షోలలో కనిపించి అల్లరల్లలి చేసేవారు కానీ చేయలేదు కాబట్టి.. వారు అటు పోవాలో తెలియక... ఇటు జబర్దస్త్ షోకి వచ్చి మొహం ఎలా చూపించాలో అర్ధంకాక అనిశ్చితిలో పడ్డారని తెలుస్తుంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: