జబర్దస్త్ నుంచి నాగబాబు విడిపోవటం చాలా మందికి ఆశ్చర్యానికి గురి చేసింది. చాలా ఏళ్ల నుంచి నాగబాబు -- రోజా జడ్జీలగా వ్యవహరిస్తూ షో ను ముందుకు నడిపించారు. మూడు రోజుల కిందట ఒక వీడియో ద్వారా.. తాను జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్న మాట వాస్తవమే అని నాగబాబు ధ్రువీకరించాడు. కొన్ని సైద్ధాంతిక పరమైన విభేదాల కారణంగా తాను ఈ షో నుంచి బయటికి వచ్చానన్నాడు. 'జబర్దస్త్'తో తనకున్న బాండింగ్ గురించి.. ఈ షో ద్వారా తనకు కలిగిన ప్రయోజనం గురించి ఆయన కొంచెం ఎమోషనల్‌గానే మాట్లాడాడు. ఐతే తాను షో నుంచి బయటికి రావడాానికి నిర్దిష్టమైన కారణాలు నాగబాబు చెప్పలేదు. దీని గురించి తర్వాత వివరిస్తా అన్నాడు.



అయితే తాను తప్పుకోవడానికి అసలు కారణమేమిటని మాత్రం చెప్పడం లేదు . ఇలా చెప్పి తాజాగా ఒక వీడియో రిలీజ్ చేశాడు నాగబాబు. అది దాదాపు పది నిమిషాల నిడివి ఉంది. తన ఎగ్జిట్ వెనుక అసలు కారణాలేంటో నాగబాబు ఈ వీడియోలో చెబుతాడేమో అని జనాలు ఆసక్తిగా చూస్తే.. అందులో ఆ విషయమే లేదు. తన జబ్దర్దస్త్ ప్రయాణం ఎలా మొదలైందో.. నెమ్మదిగా చెప్పుకుంటూ వచ్చాడు. ముందు 'జబర్దస్త్'ను 25 ఎపిసోడ్లు మాత్రమే నడిపించనున్నట్లు చెప్పి తనను తీసుకున్నారన్నాడు. షో మొదలయ్యాక ఎలా ఆదరణ పొందింది.. అందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేసింది.. వాళ్లు ఎలా ప్రతిభ చాటుకుంది.. ఎలా ఎదిగింది.. వివిధ టీంల నుంచి కొత్త లీడర్లు ఎలా వచ్చింది తాపీగా చెప్పుకుంటూ వచ్చాడు నాగబాబు. 



అయితే ఇవన్నీ జనాలకు అవసరం లేనిది. అసలు విషయం చెప్పకుండా అనవసరపు సొల్లు నాగబాబు చెబుతున్నారు. జనాలకు ఇవన్నీ ఏమంత ఆసక్తి కలిగిస్తాయన్నది ఆలోచించకుండా అవసరం లేని వివరణ ఇస్తూ వెళ్లాడు. మొత్తం వీడియో అయ్యాక కూడా అసలు విషయంలోకి రాలేదు. తన ఎగ్జిట్‌లో కీలంగా ఉన్న జబర్దస్త్ డైరెక్టర్లు నితిన్, భరత్‌ల అరంగేట్రం గురించి మాత్రమే చెప్పిన నాగబాబు.. మిగతా వివరాలు తరువాయి భాగంలో అన్నాడు. ఆ భాగానికి సంబంధించిన ప్రోమోలో ఏమో.. రచ్చరవి యాక్సిడెంట్ గురించి చెప్పుకొచ్చాడు.  చూస్తుంటే దీన్ని ఒక సీరియల్ లాగా ఒక పది ఎపిసోడ్లు నడిపించేలా ఉన్నాడు నాగబాబు. అంతా అయ్యాక కానీ అసలు విషయం చెప్పేలా లేడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: