దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక జగన్ జీవితాన్ని గమనిస్తే దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు రోడ్డు పైనే జగన్ జీవితం కనిపిస్తుంది. తండ్రి కష్టార్జితం చేత కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకు వస్తే ఆ కాంగ్రెస్ పార్టీయే...తండ్రి కోల్పోయిన జగన్ ని టార్గెట్ చేసుకుని చాలా నీచాతి నీచమైన రాజకీయాలు చేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అన్యాయంగా లేనిపోని కేసులు వేసి జగన్ ని దాదాపు 16 నెలల పాటు జైల్లో పెట్టినా కాంగ్రెస్ పార్టీ తర్వాత తన స్వార్ధ రాజకీయాలకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా చీల్చడం జరిగింది.

 

ఇదే క్రమంలో తన తండ్రిని ఆదరించిన ఆంధ్ర ప్రదేశ్ విభజన సమయంలో జైల్లో ఉన్న జగన్ నిరాహార దీక్ష చేసిన పెద్దగా అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడంతో … ఇదే క్రమంలో జగన్ జైలు నుండి విడుదల కావడంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ గల్లంతు కావడంతో...2014 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చిన దాదాపు ఎన్నో ఏళ్ల పాటు శ్రమించి త్రుటిలో అధికారం కోల్పోవడంతో ఎక్కడా కూడా నిరుత్సాహం చెందని జగన్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా అద్భుతంగా రాణించి తన స్వార్ధ రాజకీయాలకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు తీసుకున్న అనేక నిర్ణయాలను ప్రశ్నిస్తూ అసెంబ్లీలో పోరాడుతూ అతి తక్కువ సమయంలోనే చంద్రబాబు ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చే విధంగా అద్భుతమైన రాజకీయాన్ని చేసిన జగన్...తర్వాత ప్రజా సంకల్ప పాదయాత్ర మొదలుపెట్టి 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు కి దిమ్మ తిరిగిపోయే 2019 ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించండి జరిగింది.

 

అయితే భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్ ...పాదయాత్రలో మరియు అదే విధంగా ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్ తాజాగా ముఖ్యమంత్రి అయ్యి ఆరునెలలు కావస్తున్న తరుణంలో రాష్ట్రంలో ఉన్న జనం జగన్ పరిపాలన పట్ల జయహో అంటున్నారు.

 

ముఖ్యంగా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సకాలంలో వర్షాలు పడిన నేపథ్యంలో తాజాగా రాష్ట్రంలో ఉన్న రైతాంగం చాలా సంతోషం వ్యక్తం చేస్తోంది. మొత్తంమీద చూసుకుంటే అన్ని వర్గాల ప్రజలను పార్టీలతో సంబంధం లేకుండా మతంతో కులంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ మేలు చేకూరేలా జగన్ పరిపాలిస్తున్న టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు తాజాగా జగన్ ఆరు నెలల పరిపాలన గురించి కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: