ప్రస్తుతం టాలీవుడ్ డైరక్టర్స్ లో సూపర్ ఫాంలో ఉన్న వారిలో సుకుమార్ కూడా ఒకరు. రంగస్థలంతో సుకుమార్ సూపర్ హిట్ కొడితే ఆ సౌండ్ ఎలా ఉంటుందో మరోసారి చూపించాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా ప్లాన్ చేసిన సుకుమార్ ఆ మూవీని త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నను ఓకే చేసినట్టు తెలుస్తుంది. సినిమాలో బన్ని రఫ్ లుక్ లో కనిపిస్తాడని తెలుస్తుంది.  

 

ఇదిలాఉంటే సుకుమార్ ఈ సినిమాలో కూడా మరో హీరోయిన్ కు ఛాన్స్ ఇస్తున్నాడట. ఆల్రెడీ రంగస్థలం సినిమాలో ఆమెను ఎంచుకున్న సుక్కు ఈ మూవీలో కూడా ఆ హీరోయిన్ కు మంచి పాత్ర ఇస్తున్నాడట. సుకుమార్ తప్ప ఆమెలోని టాలెంట్ ఎవరు గుర్తించలేదని చెప్పాలి. రంగస్థలంలో ఆది పినిశెట్టికి లవర్ గా నటించిన పూజితా పొన్నాడా ఆ తర్వాత పెద్దగా మెప్పించే పాత్రలు చేయలేదు.    

 

చిన్న సినిమాల్లో చిన్న పాత్రలతో సరిపెట్టుకుంటున్న ఈ అమ్మడికి మళ్లీ సుకుమార్ మరో పెద్ద అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ సినిమాలో పూజితాకు క్రేజీ రోల్ దక్కిందని తెలుస్తుంది. ఈ సినిమాకు హీరోయిన్ కన్నా ఈ పాత్ర చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. హీరోయిన్ గా రష్మికకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం రష్మిక సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తుంది.

 

సుకుమార్ పూజితాని రిపీట్ చేయడంలో ఆమెకు మంచి ఛాన్స్ వచ్చినట్టే అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాతో అయినా అమ్మడి ఫేట్ మారుతుందేమో చూడాలి. తెలుగు అమ్మాయి అయిన పూజిత సరైన ఛాన్స్ రావాలే కాని తన టాలెంట్ ఏంటో చూపించేస్తా అంటుంది. మరి అమ్మడికి బన్ని సినిమాతో అయినా లక్ కలిసి రావాలని ఆశిద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: