తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు సక్సస్ అవడం చాలా తక్కువ. ఒకవేళ సినిమాలు చేసినా ఒకటి అరా తోనే సరిపెట్టుకుంటారు. అయితే లయ మాత్రం చాలా సినిమాల్లో నటించింది. సూపర్ హిట్స్ ని అందుకుంది. అయితే ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ అంతా ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో అక్కగా.. అమ్మగా అవకాశం వచ్చిన పాత్రలు చేస్తున్న విషయం తెల్సిందే. స్నేహ.. నదియా నుండి టబు వరకు పలువురు నిన్నటి తరం హీరోయిన్స్ అక్కగా.. అమ్మగా, అత్తగా రీ ఎంట్రీ ఇచ్చారు. అందులో చాలా మంది సక్సెస్ అయ్యి మళ్లీ ముందున్న క్రేజ్ తో దూసుకు పోతున్నారు. అంతేకాదు మంచి రెమ్యూనరేషన్స్ ని అందుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కొందరు సీనియర్ హీరోయిన్స్ మాత్రం తమను తాము ఏదో ఊహించుకుంటూ అమ్మ పాత్రలు అత్త పాత్రలు చేయమంటూ కొండెక్కి కూర్చున్నారు.

 

అందులో తెలుగమ్మాయి లయ ఇలాంటి బాపతే. లయ హీరోయిన్ గా చాలా సంవత్సరాల పాటు తెలుగు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది. సరిగ్గా అవకాశాలు తగ్గు ముఖం పట్టగానే ఎన్నారైను పెళ్ళి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది. పెళ్లి.. పిల్లల కారణంగా ఇంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న లయ ఇప్పుడు మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాని అక్కగా.. అమ్మగా మాత్రం నటించేందుకు తను ఆసక్తిగా లేనంటూ లయ వెల్లడించింది.

 

రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో ఒక పాత్ర చేసిన లయ అంతగా ఆకట్టుకోలేక పోయింది. మళ్లీ కథలో ప్రాముఖ్యత ఉన్న పాత్రలను చేసేందుకు లయ ఆసక్తి చూపిస్తుందట. ఈ వయసులో వచ్చిన పాత్రలను చేసుకుంటూ వెళ్లాలి తప్ప ఆ పాత్ర కావాలి.. ఈ పాత్ర చేయను అంటూ కండీషన్స్ పెడితే కష్టం. లయ కూడా కాస్త తగ్గి అక్కగానో లేదా అమ్మ గానో ఒప్పుకొని సినిమాలు చేస్తే కెరీర్ కాస్త ఊపందుకుంటుంది. నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్న ఇంకా హీరోయిన్ పాత్రలు ఎలా వస్తాయంటూ కొందరు లయ మాటలను విని కామెంట్స్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: