హైదరాబాద్ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్యను మరుకవముందే ఇలాంటి ఘోర సంఘటనలు ఒకదాని వెంట ఒకటి జరుగుతూనే ఉన్నాయి. సౌత్ లో బిగ్గ్ బాస్ కి అందులో పాల్గొన్న కంటెస్టెంట్ లకు ఎంతగా పాపులారిటి వస్తుందో తెలిసిందే. అలా పాపులర్ అయిన మలయాళ బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న ఓ యువతిని కదులుతున్న బస్సులో ఓ యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన సంచలనం అయింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆడవాళ్లపై అఘాయిత్యాలకు అడ్డు అదుపు లేకుండాపోయింది. ఇలాంటి ఘటనలు కలకలం రేపుతున్నప్పటికి  కామాంధులు తమ వక్రబుద్ధిని చూపిస్తున్నారు. సామాన్య అమ్మాయిలపైనే కాదు సెలబ్రిటీలను కూడా కామాంధులు వదలడం లేదు. 

 

ఈ ఘటన గురువారం తెల్లవారు జామున కేరళలో జరిగింది. బాధితురాలు అళువ నగరంలో బస్సు ఎక్కి వెళుతుండగా, అప్పర్ బెర్త్‌లో నిద్రిస్తున్నట్టు నటించి ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడట. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తుండడంతో భయంతో కేకలు వేసింది. డ్రైవర్ బస్సు ఆపడంతో నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలని కోరింది. అంతేకాదు తనకు జరిగిన సంఘటనను లైవ్ స్ట్రీమింగ్ చేసింది. అయితే ఈ కామాధుడు మాత్రం ఏమీ చేయలేదంటూ బుకాయించాడు. క్షమాపణలు చెప్పినప్పటికి సదురు బాధిత యువతి వెనక్కు తగ్గలేదు.

 

కొట్టక్కల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని ప్రశ్నించగా.. తాను ఆ అమ్మాయిపై ఎలాంటి అఘాయిత్యం చేయలేదని, బెర్త్ పక్కనున్న కర్టెన్స్ మూసేందుకు యత్నిస్తుంటే ఆ అమ్మాయే తప్పుగా అర్థంచేసుకుందని తెలిపాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్‌కు చెందిన ప్రియంక రెడ్డి దారుణ హత్యకు గురికావడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి నుంచైనా ఇలాంటి మృగాల నుంచి అమ్మాయిలను కాపాడాలని ప్రజలు ప్రభూత్వాన్ని, పోలీసులనువేడుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: