స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘అల...వైకుంఠపురములో. హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి పలు పోస్టర్లు, పాటలు విడుదలయి ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

 

ముఖ్యంగా పాటల్లో సామజవరగమనా.. అనే పాటకు అదిరిపోయే స్పందన వచ్చింది. అలాగే రాములో రాములో.. , ఓ మై గాడ్ డాడీ పాటలు కూడా యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్న నివేదా పెతురాజ్ లుక్ తాజాగా విడుదల చేశారు. నివేదాకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ....చిత్రబృందం పోస్టర్ రూపొందించారు. ఈ పోస్టర్ లో చాలా క్యూట్ గా కనిపిస్తుంది.  

 

సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంపై అభిమానులు, సినీ ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే అల్లు అర్జున్ కు మలయాళంలో కూడా అభిమానులు ఎక్కువగానే ఉండటంతో ఈ చిత్రాన్ని అక్కడ కూడా డబ్ చేయనున్నారు. అక్కడ చిత్రానికి అంగు వైకుంఠపురంలో అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా… సుశాంత్, టబు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. 

 

ఇక సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా జ‌న‌వ‌రి 12న వ‌స్తుండ‌గా.. ఈ సినిమాకు ఒక రోజు ముందుగా జ‌న‌వ‌రి 11న మ‌హేష్‌బాబు - అనిల్ రావిపూడి కాంబోలో వ‌స్తోన్న స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా వ‌స్తోంది. ఇద్ద‌రు పెద్ద హీరోల సినిమాలు ఒక రోజు తేడాలో వ‌స్తుండ‌డం ఒక ఎత్తు అయితే అదే సంక్రాంతికి ర‌జ‌నీకాంత్ ద‌ర్బార్ సినిమా కూడా పోటీలో ఉండ‌డంతో సంక్రాంతి రేసు ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఇక సంక్రాంతికే క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తోన్న ఎంత మంచివాడ‌వురా సినిమా సైతం రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: