ప్రముఖ పాటల రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మరియు  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనగానే ఎవరికైనా వారిద్దరి మధ్య ఉన్న మరియు జరుగుతున్న వివాదస్పదమైనా వాతావరణం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య  వర్మ తీసే ప్రతి సినిమాను విమర్శిస్తూ మీడియాలు సంచలనమైన  వ్యాఖ్యలతో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించే  జొన్నవిత్తుల ఒక సంచలన మైన నిర్ణయం తో అందరిని అవాక్కయ్యేలా చేస్తున్నారు. అదేమిటంటే  వర్మపై ఆత్మకథా చిత్రాన్ని తీస్తానని ప్రకటించడం.

పైగా దానికి ఆ సినిమాకి వర్మ ను విమర్శించేవిదంగా  పప్పు వర్మ అనే పేరు  పెడతానని ప్రకటించడం సంచలనంగా మారిపోయింది. అయితే అతడు ఏమని ప్రకటించడాన్ని లోతుగా వెతకగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు  అనే సినిమా విషయం మరియు పాత్రలద్వారా సినీ, రాజకీయ వర్గాల్లో వణుకు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై నిరసనలు రేకెత్తడం, కోర్టు కేసులు పడటం, ఆ తర్వాత సినిమా విడుదల సైతం ఆగిపోవడం మరియు సినిమా పేరుని మారుస్తానని ప్రకటించడం  జరిగాయి.

ఇలాంటి పరిస్థితుల్లో గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు వదిలిన పప్పు వర్మ అని సినిమా తీస్తానని చెప్పడంతో  జనాల్లో ఆసక్తికర అంశంగా మారింది అలాగే  అయన రామ్ గోపాల్ వర్మ జీవితచరిత్ర  కోసం సర్వం సిద్ధం చేశారని  కథను కూడా రాస్తున్నాడని తెలుస్తోంది. అతని వివరాల ప్రకారం  ఈ సినిమాలో వర్మగా  నటించనున్న నటుడు కూడా దొరికాడని  అతను  కూడా వర్మ  పోలికలతోనే ఉంటాడని తెలుస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు వర్మ ని తన పద్దతిలో ఇబ్బంది పెట్టె జొన్నవిత్తుల మరి ఈ సినిమా తో ఎలా పగ తీర్చుకోనున్నాడో చూడాల్సిందే.

అయితే జొన్నవిత్తుల ఏమిటి  అతడు గేయ రచయిత కదా సినిమా తీయడమేంటి అనుకోవొచ్చు కానీ అతడు  2005లో రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడిగా పెళ్ళాం పిచ్చోడు  అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు మంచి  హాస్యకథ చిత్రంగా ప్రజాదరణ  పొందింది అలాగే అతడికి  ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం  కూడా లభించింది ఆ చిత్రానికి అలాగే  అతడు ప్రముఖ తెలుగు కవి, మరియు ప్రముఖ సినీ గేయ రచయిత అని కూడా మనకు తెలుసు. చాల కలం తరువాత మల్లి సినిమా తెస్తున్న ఈయనకు ఎలాంటి అనుభవం ఎదురవుతుందో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: