వెటర్నరీ డాక్టర్ దిశ హత్యోదంతం యావత్ భారతావని సిగ్గుపడేలా చేసింది.  కామంతో కళ్లు మూసుకొని నలుగురు కృర మృగాళ్లు తోడేళ్లలా దిశపై అత్యాచారం చేసి ఆపై హత్యచేసిన సంఘటన ప్రతి ఒక్కరికీ కంట నీరు తెప్పిస్తుంది.  సామాన్య జనమే కాదు సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారు సైతం ఈ దారుణాన్ని ఖండిస్తున్నారు. ఇలాంటి దారుణానికి తెగబడిన వారికి ఉరే సరైన శిక్ష అంటున్నారు.  నేడు పార్లమెంట్ లో సైతం దిశ కు జరిగిన అన్యాయంపైనే చర్చలు సాగాయి.  ప్రతి ఒక్కరూ మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై గళం విప్పారు.  దిశపై అత్యాచారం చేసి హత్యచేసిన వారికి కఠినమైన శిక్ష విధించాలని కోరారు.  

 

తాజాగా దిశ సంఘటనపై సినీ లోకం కన్నీటి పర్యంతం అవుతుంది.  తాజాగా యాంకర్ ఉదయభాను దిశకు జరిగిన అన్యాయాన్ని తల్చుకొని కన్నీరు మున్నీరు అయ్యింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...సమాజంలో మార్పు కోసం ఎంత కాలం ఎదురుచూడాలి? చిన్న పిల్లలకు ఆటలు నేర్పించాలా? లేక పోతే బ్యాడ్ టచ్, గుడ్ టచ్ నేర్పించాలా? ప్రతి తల్లిదండ్రులు తమ అమ్మాయిల గురించి ఆందోళన చెందుతున్నారు  అని అన్నారు.  ఆడపిల్లను కనడం తల్లిదండ్రుల నేరమా..ఆడ పిల్ల కనిపిస్తే మృగాళ్లలా రెచ్చిపోతారా? వారి ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటే..? అని ఆవేదన వ్యక్తం చేశారు.

 

బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు వెళితే బాయ్ ఫ్రెండ్ తో వెళ్లి ఉండొచ్చు.. పోయి పని చూసుకో అన్నారట. దీనిపై ఎలా స్పందించాలి? పోలీసులసు సస్పెండ్ చేస్తారు, మళ్లీ నాలుగు రోజుల తర్వాత ఉద్యోగాలు ఇచ్చేస్తారు.  ఆ రోజే వారు సరైన రీతిలో స్పందిస్తే.. ఇంత అన్యాయం జరిగి ఉండేదా అని ప్రశ్నించారు. దిశ ఘటనపై సోషల్ మీడియాలో కొందరు విషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఉదయభాను ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వారు చీడపురుగులాంటి వారని వ్యాఖ్యానించారు. ఈ ఘోర ఘటన జరిగినప్పటి నుంచి తన వెన్నులో వణుకు పుడుతోందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: