ఈ మధ్య పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ అంటూ ఇసుక కొరత మీద హడావుడి చేసిన సంగతి తెలిసిందే. అయితే పెద్దగా ఆయన ప్రభావం మాత్రం పనిచేయలేదు. ఇప్పుడు తెలుగు భాష మీద లెక్చర్ ఇచ్చారు. ఇది టాలీవుడ్ లో సంచలనం అవుతోంది. ఆంగ్ల మాధ్యమ విద్య వల్ల తెలుగు భాష ఉనికిని కోల్పోతోందని విమర్శలున్నాయి. దీనిపై భాషా ఉద్యమాలెన్నో జరుగుతున్నాయి. అయితే ఇటీవల తిరుపతిలో జరిగిన తెలుగు వైభవం ఆత్మీయ సమావేశంలో టాలీవుడ్ లో తెలుగు భాష పరిస్థితిపై జనసేనాని .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫైరవ్వడం పరిశ్రమలో పెద్ద చర్చ జరుగుతోంది. 

 

టాలీవుడ్ లో తెలుగు భాష మాట్లాడలేని హీరోలు ఉన్నారని పవన్ వ్యాఖ్యానించడం టాలీవుడ్ లో సంచలనమైంది.  తెలుగు సినిమా హీరోల్లో చాలా మందికి తెలుగు చదవడం.. రాయడం రాదని విమర్శించారు. సినిమాల్లోని బూతుల వల్ల సమాజంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సినీ పరిశ్రమలో తెలుగు పూర్తిగా దిగజారిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంగ్లం అర్థంకాకపోవడం వల్లనే తను ఇంటర్మీడియట్ తో చదువు ఆపేశానని అన్నారు. తెలుగు ప్రేక్షకులు ద్వారా డబ్బు అవసరం కానీ.. తెలుగు నేర్చుకోవాలని.. మాత్రం సినిమాల్లోని చాలా మందికి లేదని విమర్శలు గుప్పించారు.

 

తెలుగు భాష అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేస్తాయని తాను భావించడం లేదని అన్నారు. తెలుగు మూలాల్ని చంపే ప్రయత్నం చేయొద్దని.. తెలుగులో పదాలు వెతుక్కునే పరిస్థితికి సిగ్గుపడుతున్నానని, బాధపడుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగు నేర్చుకుంటేనే ఇతర భాషలు సులువుగా అర్థమవుతాయని అన్నారు. అయితే తెలుగు రాని హీరోలు అని పవన్ ఎవరిపై చురకలు వేశారు? అన్నది మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ తెలుగు రాని ఆ హీరోలెవరెవరు ఉన్నారు అంటూ ఇప్పుడు వెతికే పనిలో కొందరు ఆసక్తిగా వెంపర్లాడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: