ప్రస్తుతం తెలుగు టెలివిజన్ ఛానల్స్ లో మంచి పేరు మరియు ఆకట్టుకునే టాలెంట్ తో దూసుకెళ్తున్న యువ యాంకర్లలో రష్మీ గౌతమ్ కూడా ఒకరు అని చెప్పకతప్పదు. ప్రస్తుతం రష్మీకి యూత్ మరియు లేడీస్ లో మంచి క్రేజ్ ఉందనే చెప్పాలి. 2002లో వచ్చిన హోలీ అనే సినిమా ద్వారా టాలీవుడ్ కి నటిగా రంగ ప్రవేశం చేసిన రష్మీ, ఆ తరువాత తన ఆకట్టుకునే అందం మరియు నటనతో అక్కడక్కడా కొన్ని సినిమాల్లో అవకాశాలు సంపాదించింది. 

 

ఇక 2007లో వనిత టీవీలో ప్రసారం అయిన యువ అనే షో ద్వారా మంచి పేరు సంపాదించిన రష్మీకి ఆ తరువాత నుండి పలు టివి షోల్లో కూడా అవకాశం రావడం జరిగింది. అయితే దాదాపుగా ఏడేళ్ల క్రితం నుండి ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఆమెకు మంచి పేరు మరియు క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ఇక ఆ షోలో మంచి పేరు లభించడంతో ఆమెకు సినిమా అవకాశాలు కూడా బాగా పెరిగాయి. ఇక షోల్లోనే కాక బయట కూడా తన సన్నిహితులతో కూడా ఎంతో చలాకీగా వ్యవహరించే రష్మీ

 

నిన్న తన సోదరుడైన మేజర్ మలేయ్ త్రిపాఠి వివాహ సందర్భంగా విశాఖపట్నం విచ్చేసి ఆ పెళ్ళిలో ఎంతో సందడి చేసారు. ఇక పెళ్లి వేడుక సందర్భంగా రోడ్ పై వెళ్తున్న ఊరేగింపులో రష్మీ కూడా పలు పాటలకు ఆనందంతో తన కుటుంబసభ్యులతో కలిసి చిందేశారు. ఇక ఆమెను చూడడానికి అక్కడి స్థానికులు కూడా బాగానే ఎగబడ్డారు. ఇక ఎంతో వైభవోపేతంగా జరిగిన ఆ పెళ్లి వేడుకలో రష్మీ ఆనందంతో డాన్స్ చేసిన ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఆమె కొన్ని టివి షోల తో పాటు రెండు సినిమాల్లో కూడా నటిస్తున్నట్లు సమాచారం....!!

మరింత సమాచారం తెలుసుకోండి: