తెలుగు సినిమా రంగంలో మాస్ డైరెక్టర్లలో ఒకరు బోయపాటి శ్రీను. మాస్ ప్రేక్షకులను అలరించే విధంగా సినిమాలు తెరకెక్కించడంలో బోయపాటి స్టైలే వేరు. తెలుగు సినిమా రంగంలో స్టార్ హీరోలను అదిరిపోయే రేంజ్ లో మాస్ తరహా లో చాలా పవర్ ఫుల్ గా చూపించాలంటే డైరెక్టర్లలో ముందు వరుసలో ఉంటారు బోయపాటి. అంతేకాకుండా రొటీన్ కథలతో సినిమాలు రూపొందిస్తారనే విమర్శ ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తీసిన 'వినయ విధేయ రామ' సినిమా నిరాశపరచడంతో బోయపాటిపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఇటువంటి నేపథ్యంలో డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ విషయంలో మరియు ఇంకా అనేక విషయాల్లో కొన్ని సరికొత్త నిర్ణయాలు తీసుకున్నట్లు తన పంథా మార్చబోతున్నట్లు తెలుస్తోంది.

 

ఈ నేపథ్యంలో బాలకృష్ణతో నెక్స్ట్ చేయబోయే సినిమా కోసం ఇప్పటికే చాలా జాగ్రత్తలు బోయపాటి తీసుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. అంతే కాకుండా సినిమాల్లో స్టోరీ చాలా వైవిధ్యంగా డిఫరెంట్ గా ఉండటానికి అన్ని జాగ్రత్తలు బోయపాటి తీసుకున్నట్లు ఈ నేపథ్యంలో తన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇప్పటికే చాలా మార్పులు తీసుకున్నట్లు అంతేకాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కొంతమందిని తన టీం నుండి తొలగించడానికి బోయపాటి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ వినపడుతోంది. అంతేకాకుండా కొత్తగా ఆలోచించగలిగే యువకులైన అసిస్టెంట్స్ ని తన టీంలో తీసుకోవడానికి బోయపాటి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

 

ఇదే క్రమంలో డిసెంబర్ నుండి బాలయ్య బాబు తో చేయబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి బోయపాటి రెడీ అవుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా గతంలో తన డైరెక్షన్లో బాలకృష్ణ కెరియర్లో రెండు బ్లాక్ బస్టర్ పడటంతో ఖచ్చితంగా ఈ కొత్త సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి బోయపాటి అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. అంతేకాకుండా ఈ సినిమాలో  నెగిటివ్ రోల్ లో రోజా నటిస్తున్నారని ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: