బాలీవుడ్ ఇండస్ట్రీలో, హిందీ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఒకే ఒక్క తెలుగు స్టార్ హీరో ప్రభాస్. ఈ విషయం 'బాహుబలి' రెండు భాగాలు రిలీజ్ అయిన సమయంలో చాలామంది నమ్మలేదు కానీ 'సాహో' సినిమా హిందీ వెర్షన్ సూపర్ హిట్ కావడంతో అందరికీ నిజమేనన్న ఈ వాస్తవాన్ని నమ్మక తప్పలేదు. ఒకప్పుడు మెగాస్టర్ కి బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది. ఇప్పుడది ప్రభాస్ కి పదిరెట్లు ఎక్కువైంది. బాహుబలి, సాహో వంటి భారీ బడ్జెట్ సినిమాలని తెరకెక్కించి మన తెలుగు సినిమా రేంజ్ ఎంటో చూపించారు దర్శక, నిర్మాతలు. అంతేకాదు ప్రభాస్ వంటి హీరోతో పాన్ ఇండియా సినిమా తీసి సక్సస్ అవొచ్చన్న విషయాన్ని ప్రూవ్ చేశారు. 

 

కంటెంట్ అంతగా లేనపటికి 'సాహో' తో బాలీవుడ్ లో ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి అంటే.. ఒకవేళ నిజంగా సినిమా సూపర్ అయితే కలెక్షన్ల వర్షం కురిసి ఉండేదనడంలో ఆశ్చర్యం లేదు. అంతేకాదు గ్యారెంటీగా మరోసారి ప్రభాస్ రేం ఎక్కడికో వెళ్ళి ఉండేది. అందుకే ఇప్పటికీ ప్రభాస్ తో సినిమా చేసేందుకు బాలీవుడ్ నిర్మాతలు ఆసక్తి చూపిస్తూనే ఉన్నారట. ఆల్రెడీ బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కు కొన్ని కొన్ని పెద్ద ప్రొడక్షన్స్ నుంచి బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయి. కానీ ప్రభాస్ మాత్రం ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అందులో ఒక ఆఫర్ ఆదిత్య చోప్రా నుంచి కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఆఫర్ ని ప్రభాస్ ఒప్పుకుంటాడని కూడా మన తెలుగు ఇండస్ట్రీలో చెప్పుకున్నారు. సక్సెస్ ఫుల్ యాక్షన్ ఫిలిమ్స్ ఫ్రాంచైజీ అయిన 'ధూమ్' లో నాలుగవ భాగానికి ప్రభాస్ ను తీసుకుందామని ఆయన ప్లాన్ చేశారట. అయితే ఎందుకనో ప్రభాస్ ఒప్పుకోకపోవడంతో ఆ ఆలోచనను అప్పట్లో పక్కన పెట్టారట. 

 

అయితే మళ్ళీ  ఈమధ్య.. 'వార్'.. 'సాహో' లాంటి యాక్షన్ ఫిలిమ్స్ కు ప్రేక్షకుల దగ్గర్నుంచి దక్కిన ఆదరణ చూసిన తర్వాత ధూమ్ సీరీస్ లో ఫోర్త్ పార్ట్ 'ధూమ్-4' తెరకెక్కించాలని ఆయన నిర్ణయించుకున్నాడట. అందుకే మరోసారి ప్రభాస్ ను సంప్రదించారని తాజా సమాచారం. ప్రభాస్ కనుక ఓకే చెప్తే ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాల్సి ఉంటుంది. నిజంగా అదే గనక జరిగితే ప్రభాస్ క్రేజ్ ఇప్పుడున్నదానికి పది రెట్లు పెరుగుతుందనడంలో ఏమాత్రం సందెహం లేదు. మరి ఈసారైనా మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ సినిమాకి 'ఎస్' చెప్తాడా.. లేదా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: