సాధారణంగా గుడి పరిసర ప్రాంతాలలో దేవుడికి సంబందించిన సినిమాలు, పాటలు వేస్తారు, చదువుకునే పిల్లలకు సినిమా చూపించాలంటే తల్లిదండ్రులైతే మంచి కుటుంబసమేత చిత్రాలు లేదా హాస్యకదా చిత్రాలు చుపిస్తారు అదే ఉపాధ్యాయులు చూపించాల్సి వస్తే హ్యూమన్ డెవలప్మెంట్, కెరీర్ డెవలప్మెంట్ వీడియోలు గాని సినిమాలు గాని చుపిస్తారు, అదే బస్టాండ్, రైల్వే స్టేషన్ మరియు పబ్లిక్ స్థలాలలో  లలో వ్యాపార ప్రకటనలతో పాటు ఏవైనా మంచి సినిమాలు వేస్తుంటారు కానీ  వెలది  మంది సంచరించే  బస్ స్టాప్ లో శృంగార భరిత నీలిచిత్రాలు ప్రదర్శిస్తే .......! ఏమిటి నీలి చిత్రాలా..? అని ఆశ్చర్యపోవడం లో అతిశయోక్తి లేదు ఎందుకంటే ఏది నిజం  మధ్యప్రదేశ్ లోని భోపాల్ నగరంలోని సిటీ బస్ స్టాప్ లో  ఈ ఉదంతం జరిగింది.  

నీలిచిత్రం  ప్రదర్శించడంతో  ప్రయాణికులు చూడగానే ఒక్క సారి హడలిపోయారు. బ్లూ ఫిలిం ప్రదర్శిస్తున్న సమయంలో బస్సుల్లో సంచరించడానికి బస్ స్టాప్ కు వచ్చిన ప్రయాణికులు, విద్యార్థులు బ్లూ ఫిలిం చూసి కొందరు తిట్టుకోగా కొందరు ఆసక్తి గల ప్రజలు  పండగ చేసుకున్నారు. చిత్రం ప్రదరిస్తున్న సమయం లో   ఓ ప్రయాణికుడు తన ఫోన్ లో  లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో ఆ వార్త సంచలనం  అయ్యింది. ఎవరికి ఏం పోయే కాలం వచ్చిందో బస్ స్టాప్  టీవీ లో బ్లూ ఫిలిం అప్ లోడో చేశారని మహిళలు మరియు  అమ్మాయిలు మండిపడుతున్నారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ నగరంలోని సిటీ బస్ స్టాప్ లో ఈ  బ్లూ ఫిలింని  ప్రదర్శించారు. 

భోపాల్ లోని సిటీ బస్ స్టాప్ లో ప్రయాణికుల టికెట్ పరిస్థితి చూసుకోవడానికి ఒక కంప్యూటర్  యంత్రాన్ని ఏర్పాటు చేశారు ఆ కంప్యూటర్లకే అన్ని యంత్రాలు అనుసంధానం చేసారు అయితే  వేలాది మంది ప్రయాణికులు వేచిఉన్న సమయంలో బస్ స్టాప్ లో ఒక్కసారిగా బ్లూ ఫిలిం వీడియో ప్రదర్శించడంతో ప్రయాణికులు షాక్ కు గురైనారు.

 ఈ బస్ స్టాప్ నుంచి ప్రతిరోజూ వేల మంది విద్యార్థులు బస్సుల్లో ప్రయాణిస్తుంటారని వారిలో చాల మంది కాలేజ్ అమ్మాయిలు మరియు అబ్బాయిలు కూడా  ఉంటారని  చిల్లరగా తెరిగే పోరంబోకులు గాని అల్లరి విద్యార్థులు ఆ కంప్యూటర్ లోకి నీలిచిత్రాలు అప్లోడ్ చేసి ఉండవచ్చని  తెలిపారు.ఈ విషయంపై సైబర్ సెల్ లో ఫిర్యాదు చేశామని, సంబంధిత అధికారులు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశామని ఆర్టీసీ  డైరెక్టర్ కేవాల్ మిశ్రా  మీడియాకు వివరించారు. ఈ విషయం సీరియస్ కావడంతో పోలీసులు సైతం రంగంలోకి దిగి విచారణ మొదలు పెట్టారు. చూడాలి ఎవరు చేసారు అని.  

మరింత సమాచారం తెలుసుకోండి: