కొన్ని సార్లు హీరోయిన్స్ బోల్డ్ కామెంట్స్ .. హాట్ కామెంట్స్ చేసి అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా హీరోయిన్ నర్గిస్ ఫక్రి అటువంటి వ్యాఖ్యలే చేసింది. బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘రాక్‌స్టార్’ సినిమాతో స్టా్‌ర్‌డం సంపాదించుకున్నారు బాలీవుడ్ బ్యూటీ నర్గిస్ ఫక్రి. ఆ తర్వాత అర కొర సినిమాలు చేశారు తన పర్సనల్ లైఫ్‌లో సమస్యలు రావడంతో వెండితెరకు కూడా దూరమయ్యారు. అయితే నర్గిస్ బాలీవుడ్‌లోకి ఎందుకు వచ్చిందో వెల్లడిస్తున్న ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ అవుతోంది. బాలీవుడ్ సినిమాల్లో సెక్స్ సన్నివేశాలు ఉండవు కాబట్టి ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారట నర్గిస్.

 

ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా నర్గిస్ చెప్పుకొస్తుంది. తన విలువలు కోల్పోయే పనులు, సినిమాలు ఎప్పుడూ చేయనని తెలిపారు. అందుకే ప్లేబాయ్ మ్యాగజైన్ అర్థనగ్నంగా ఫొటోషూట్లలో పాల్గొంటే కోట్లు ఇస్తామన్నా కూడా ఒప్పుకోలేదని పేర్కొన్నారు.  నేను మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడు ప్లేబాయ్ మ్యాగజైన్ నిర్వాహకులు మా కాలేజ్‌కి వచ్చారు. అబ్బాయిలతో కలిసి సెక్స్ చేస్తున్నట్లుగా పోజులిస్తూ ఫొటోషూట్లు చేస్తే కోట్లల్లో పారితోషికం ఇస్తారని తెలిసింది. నేను ఒప్పుకుని ఉంటే నాకు ఎంతో డబ్బు వచ్చేది. కానీ నేను మాత్రం అస్సలు ఒప్పుకోలేదు.

 

ఇంకా చెబుతూ ప్రస్తుతం నేను బాలీవుడ్ లో నటిస్తున్నందుకు సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. ఇంకా ఈ బ్యూటీ నర్గిస్ ఫక్రి చెబుతూ .. ఎందుకంటే ఇక్కడి సినిమాల్లో నగ్నంగా కనిపించే అవసరం ఉండదు, సెక్స్ సీన్లలో నటించే పని కూడా ఉండదు’ అని తెలిపారు. దీనిని బట్టి చూస్తే నర్గిస్ అసలు బాలీవుడ్ సినిమాలు చూడరేమో అనిపిస్తోంది. ఎందుకంటే బాలీవుడ్ సినిమాల్లో ఓవర్ ఎక్స్‌పోజింగ్, సెక్స్ రిలేటెడ్ కంటెంట్ కాస్త ఎక్కువే ఉంటుంది. అయితే తన వద్దకు అలాంటి పాత్రలు రాలేదని ఆమె పై విధంగా స్పందించి ఉండొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: