ఒకప్పుడు ప్రపంచానికి భారతీయ సినిమా అంటే హిందీ సినిమాలే. దేశీయంగా బాలీవుడ్ ఆధిపత్యం.. అంతర్జాతీయంగా హిందీ సినిమాల కలెక్షన్లు, అక్కడి హీరోల క్రేజ్.. ఇలా బాలీవుడ్ ఆధిపత్యం కొనసాగింది. వీటన్నంటికీ చెక్ పెట్టి ప్రపంచ సినిమాను నివ్వెరపరచిని టాలీవుడ్ రాజసం బాహుబలి-2 సినిమా. బాహుబలి సృష్టించిన సంచలనానాకి బాలీవుడ్ కి మౌనమే సమాధానం అయింది. ప్రపంచానికి.. ఇండియాలో ఓ రీజనల్ సినిమాకు ఇంత సత్తా ఉందాఅని ఆశ్చర్యపోయేలా చేసింది. కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమాను యాహూ ఇండియా మాత్రం గుర్తించకుండా అవమానానికి గురి చేసింది.

 

 

రీసెంట్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది డికేడ్అనే కంటెస్ట్ ను రన్ చేసింది యాహూ. ఈ కంటెస్ట్ లో అమీర్ ఖాన్ నటించిన దంగల్నెంబర్ వన్ స్థానంలో నిలిచి.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది డికేడ్ గా ఎంపికైంది. దంగల్ ప్రపంచవ్యాప్తంగా 2వేల కోట్ల కలెక్షన్లు సాధించింది. చైనా కలెక్షన్లతో పోల్చుకుంటే ఈ రేర్ ఫీట్ సాధించింది. కానీ బాహుబలి మాయాజాలం మాత్రం తక్కువేమీ కాదు. ఒక్క ఇండియాతో పోల్చుకుంటే దంగల్ కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించింది. ఇక్కడ విషయమేమిటంటే.. యాహూ ఇండియా పోటీలోకి తీసుకున్న టాప్ టెన్ సినిమాల్లో బాహుబలికి కనీసం స్థానం కల్పించలేదు. ఇది నిర్వాహకుల నిర్లక్ష్యమా.. బాహుబలిని లెక్కలోకి తీసుకోలేదా.. తెలుగు సినిమాలపై ఉన్న కంటగింపా అనేది తెలీదు.

 

 

టాక్ ఆఫ్ ది ఇండియాగా నిలిచిన బాహుబలిని పోటీలో దింపుంటే పోటీ రసవత్తరంగా సాగింది అని చెప్పాలి. కానీ అసలు లెక్కలోకి తీసుకోకపోవటం రీజనల్ సినిమాలపై ఉన్న చిన్న చూపే అని తెలుస్తోంది. తెలుగు నుంచి పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా వస్తున్నా కూడా ఇలా గుర్తించకపోవడం సగటు సినీ అభిమానిని బాధించేదే.

మరింత సమాచారం తెలుసుకోండి: