టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీ హీరోలు అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతో అభిమానం.  సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసులుగా నందమూరి హరికృష్ణ, బాలకృష్ణలు వెండి తెరకు పరిచయం అయ్యారు.  కానీ స్వర్గీయ హరికృష్ణ మాత్రం తన తండ్రి ఎన్టీఆర్ తో రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమాలకు దూరమయ్యారు.  ఇక నందమూరి బాలకృష్ణ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.  సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.  ఆ మద్య క్రిష్ దర్శకత్వంలో వచ్చిన తన 100వ సినిమా ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ విజయం తర్వాత వరుసగా సినిమాలు తీస్తూ వస్తున్నారు.

 

ఈ ఏడాది తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ లో నటించారు.  రెండు భాగాలుగా వచ్చిన ఈ మూవీస్ ఆడియన్స్ ని నిరాశపరిచాయి.  ఈలోగా ఏపిలో ఎన్నికలు రావడం.. ఎమ్మెల్యేగా హిందూపూర్ నుంచి పోటీ చేసి గెలవడం జరిగిపోయింది.  తాజాగా కేఎస్ ర‌వికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న మూవీ ‘రూరల్’.  గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘జై సింహా’ మూవీ తెరకెక్కింది. కాకపోతే ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ని అంత‌గా అల‌రించ‌లేక‌పోయింది.  ఇక రూల‌ర్   సినిమాతో ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేయాల‌ని వీరు భావిస్తున్నారు.

 

డిసెంబ‌ర్ 20న విడుద‌ల కానున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈ మూవీలో  బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భూమిక ముఖ్యపాత్రలో క‌నిపించ‌నుంది. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కి భారీ రెస్పాన్స్ రాగా, రీసెంట్‌గా చిత్రం నుండి అడుగ‌డుగో యాక్ష‌న్ హీరో అనే లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల చేశారు. రామ‌జోగయ్య శాస్త్రి ఈ పాట‌కి లిరిక్స్ అందించ‌గా, సాయిచ‌ర‌ణ్ భాస్క‌రుని ఆల‌పించారు. తాజాగా ఇదే పాట వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో బాలయ్య చాలా స్లిమ్ గా స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: