ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బయోపిక్ పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్రకు సంబంధించి పలు సినిమాలు రాగా దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితానికి సంబంధించి యాత్ర అనే సినిమా తెరకెక్కడం జరిగింది. అంతేకాకుండా పరిటాల రవికి సంబంధించి రక్త చరిత్ర సినిమాలు రావడం జరిగాయి. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాలలో మరియు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ క్రేజ్ ఏర్పరచుకొని తమిళుల చేత అమ్మ అని పిలిపించుకున్న దివంగత జయలలిత జీవితానికి సంబంధించి బయోపిక్  'తలైవి' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే.

 

ఈ నేపథ్యంలో జయలలిత రాజకీయ జీవితంలో కీలక వ్యక్తి అయినా ఎంజీఆర్ పాత్రలో అరవిందస్వామి మరియు అదే విధంగా మరో కీలక వ్యక్తి శశికళ పాత్రలో ప్రియమణి నటిస్తున్నట్లు తమిళ మీడియా వర్గాల్లో వార్తలు వినబడుతున్నాయి. ఇదిలాఉండగా తాజాగా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో విజయ్ దేవరకొండ చేత నటింపజేయడం కోసం తలైవి సినిమా యూనిట్ రంగంలోకి దిగినట్లు సౌత్ ఇండియాలో వార్తలు వినపడుతున్నాయి. విషయంలోకి వెళితే విజయ్ దేవరకొండను తలైవి చిత్ర యూనిట్ ఇటీవల ఒక పాత్ర కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది.

 

జయలలిత జీవితంలో శోభన్ బాబు పాత్ర చాలా కీలకమని చెప్పాలి. అందుకే ఆ పాత్ర కోసం విజయ్ దేవరకొండను సంప్రదించినట్లు సమాచారం. అయితే అఫర్ పై విజయ్ ఏ విధంగా స్పందించాడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.  ప్రస్తుతం దేవరకొండ వరల్డ్ ఫెమస్ లవర్ కి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. అలాగే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఫైటర్ అనే సినిమాకు రెడీ అవుతున్నాడు. మరి తైలవి బయోపిక్ లో నటించడానికి విజయ్ ఒప్పుకున్నాడా? అనే విషయం తెలియాలంటే మరికొన్నిరోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమా కథని బాహుబలి రైటర్ విజయేంద్రప్రసాద్ అందించడం జరిగింది. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: