హిందీలో పలు సినిమాలు నటించిన బోల్డ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రి. కెరీర్లో టాప్ లీగ్ లోకి వెళ్లకపోయినా హీరోయిన్ గా మంచి గుర్తింపే ఉంది. సినిమాలు లేకపోయినా నిత్యం సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. రీసెంట్ గా ఈ భామ మాల్దీవుల్లో ఇచ్చిన బికినీ స్టిల్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఆమధ్య తనకొచ్చిన ఓ ఆఫర్ గురించి ఆసక్తికర అంశం బయటపెట్టింది.

 

 

అమెరికాకు చెందిన ప్లేబాయ్ పత్రిక గురించి తెలిసే ఉంటుంది. ఈ పత్రికకు ఇచ్చే స్టిల్స్ కోసం ఓ రేంజ్ ఉంటేనే కానీ వారు ఎవరినీ సంప్రదించరు. హాలీవుడ్ నటీమణులు చాలామంది ఈ పత్రిక కవర్ పేజీలో పడేందుకు ఉత్సాహం చూపిస్తారు. అలాంటి ప్లేబాయ్ పత్రిక నర్గీస్ కు భారీ బంపర్ ఆఫర్ ను ఇవ్వజూపారట. కానీ నర్గీస్ ఆ ఆఫర్ ను సున్నితంగానే తిరస్కరించిందట. ఇంతకీ ప్లేబాయ్ పత్రిక వాళ్లు నర్గీస్ కు ఇచ్చిన ఆఫర్ ఏంటో తెలుసా.  ప్లేబాయ్ కోసం నర్గీస్ ను నగ్నంగా కవర్ పేజ్ స్టిల్ ఇవ్వమన్నారట. ఇందుకు కోట్లలో డబ్బును ఆఫర్ చేశారట. కానీ నర్గీస్ ఆ ఆఫర్ ను తిరస్కరించిందట. ఈ విషయాన్ని ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

 

 

తనకు కొన్ని నియమాలు ఉన్నాయని.. గ్లామర్, సెక్సీగా కనబడినంత మాత్రాన నగ్నంగా నటించేది లేదని స్పష్టం చేసిందట. ఇండియా నుంచి ప్లేబాయ్ పత్రికలో షర్లిన్ చోప్రా మాత్రమే నగ్నంగా నటించింది. మన హీరోయిన్లు అందరూ దాదాపు స్విమ్ సూట్స్, టూపీస్ బికినీలు వేస్తారు కానీ నగ్నంగా నటించరు. దీంతో కోట్లాది డబ్బు ఆఫర్ చేసినా నర్గీస్ తిరస్కరించిందట. రాక్ స్టార్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నర్గీస్ ఆమధ్య ఉదయ్ చోప్రాతో ప్రేమలో పడిందని వార్తలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: