మహేశ్.. ఎన్టీఆర్.. రామ్ చరణ్ లాంటి స్టార్స్ కు విజయ్ దేవరకొండ కంటే ఎక్కువ క్రేజ్ ఉండొచ్చు. విజయ్ కంటే డబుల్.. త్రిబుల్ రెమ్యునరేషన్ తీసుకోవచ్చు. కానీ ఒక విషయంలో మాత్రం స్టార్స్ కంటే డబుల్.. త్రిబుల్ రెమ్యునరేషన్ తీసుకోవచ్చు. కానీ ఒక విషయంలో స్టార్స్ కంటే విజయే ఎక్కువ సంపాదించాడు. ఈ క్రేజ్ ను పూరీ జగన్నాథ్ మూవీతో కంటిన్యూ చేస్తున్నాడు. ఇంతకీ విజయ్ కు ఉన్న స్పెషల్ ఇమేజ్ ఏంటో ఓ సారి పరిశీలిస్తే.. !

 

రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తో ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. మహేశ్ ఇంకా అటుగా అడుగు వేయలేదు. అయితే స్టార్ కాని స్టార్ విజయ్ చేస్తున్నవన్నీ అలాంటి చిత్రాలే. తెలుగు, తమిళంలో రూపొందిన నోటాతో.. కోలీవుడ్ పై కన్నేశాడు. సినిమా ఫెయిల్ అయినా.. ప్రయత్నం ఆపకుండా.. డియర్ కామ్రేడ్ ను దక్షిణాది భాషలన్నింటిలో రిలీజ్ అయ్యేలా జాగ్రత్తపడ్డాడు. 


డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. ఈ సినిమాను కూడా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో రిలీజ్ చేస్తారని తెలిసింది. ఇలా మార్కెట్ పెంచుకుంటూ.. దూసుకుపోతున్నాడు విజయ్. 

 

వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత విజయ్ పూరీ జగన్నాత్ మూవీ చేయనున్నాడు. ఛార్మి, పూరీ నిర్మాతలు కాగా.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ తో నిర్మిస్తారని తెలిసింది. సౌత్ ఇండియా లాంగ్వేజస్ లోనే కాకుండా.. హిందీలో కూడా రిలీజ్ అయ్యేలా ఇప్పటి నుంచే ప్లాన్ వస్తున్నారట. 


విజయ్ దేవరకొండ ఇప్పటికే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టుగా తన సినిమాలు ఉండేలా స్టోరీస్ సెలక్ట్ చేసుకుంటున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులను మెప్పిస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు. ఇంకేముందీ విజయ్ దేవర కొండ పేరు చెబితే ఇపుడు కుర్రకారు తెగ ఉర్రూతలూగిపోతున్నారు. 



 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: