నాని నటించిన 'గ్యాంగ్ లీడర్'తో టాలీవుడ్ లోకి  హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది చెన్నై  బ్యూటీ  ప్రియాంక అరుళ్ మోహన్.  సినిమా ఫలితం పక్కన బెడితే తన  క్యూట్  లుక్స్ తో   యూత్ ను ఫిదా చేసింది ప్రియాంక.  ఇక ఈ చిత్రం తరువాత  ఆమె  తెలుగులో  బిజీ అవ్వడం ఖాయమనుకున్నారంతా కానీ  ఇంతవరకు  తెలుగులో మరో  ఛాన్స్  దక్కించుకోలేకపోయింది. 
 
 
ఇక ఇప్పుడు ప్రియాంక కు ఓ భారీ ఆఫర్ వచ్చింది అది  అయితే  అది తెలుగులో కాదు  కోలీవుడ్ లో..   తమిళ స్టార్ హీరో  శివ కార్తికేయన్, కోలమావు  కోకిల ఫేమ్ నెల్సన్ కాంబినేషన్ లో డాక్టర్ అనే చిత్రం  తెరకెక్కనుంది.   ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్   హీరోయిన్ గా నటించనుంది.  రేపటి నుండి  ఈ సినిమా షూటింగ్  స్టార్ట్ కానుంది.  కోలీవుడ్ లో ప్రియాంక కు ఇదే మొదటి సినిమా.   మరి ఈ చిత్రంతో  ప్రియాంక అక్కడ బిజీ అవుతుందేమో చూడాలి.  యంగ్  మ్యూజిక్  సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో  యోగిబాబు , డిటెక్టివ్ ఫేమ్ వినయ్ కీలక పాత్రల్లో  కనిపించనున్నారు.  కేవలం  ఈసినిమా షూటింగ్ ను 50 రోజుల్లో  పూర్తి చేసేలా  ప్లాన్ చేస్తున్నారు.   త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్ , కెజెఆర్ స్టూడియోస్ సంయుక్తంగా  నిర్మించనున్న ఈ చిత్రం  వచ్చే ఏడాది  సమ్మర్ లో  ప్రేక్షకుముందుకు రానుంది.
 
 
ఇక ఈ చిత్రం కన్నా ముందు  శివ కార్తికేయన్ , హీరో తో ప్రేక్షకులముందుకు రానున్నాడు. అభిమన్యుడు ఫేమ్ పీఎస్ మిత్రన్  తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈచిత్రంతో  హలో బ్యూటీ  కళ్యాణి ప్రియదర్శన్  కోలీవుడ్ లోకి  ఎంట్రీ ఇస్తుంది. డిసెంబర్ 20 న ఈచిత్రం విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: