ఏ హీరోకైనా వరుసగా బ్లాక్ బస్టర్స్ పడితే లక్కీ ఫెలో అంటారు. కానీ కార్తీక్ ఆర్యన్ ని అమ్మాయిల విషయంలో లక్కీ ఫెలో అంటోంది బాలీవుడ్. ఈ హీరోలో ఏం మేజిక్ ఉందోగానీ హీరోయిన్ లు చూడగానే అతనికి పడిపోతున్నారని కామెంట్ చేస్తున్నారు.


కార్తీక్ ఆర్యన్ ని టాలెంట్ కు బాలీవుడ్ అంతా ఆశ్చర్యపోతోంది. సినిమాకో హీరోయిన్ ని లైన్ లో పెడుతోన్న ఈ హీరోని చూసి బీటౌన్ ప్లేబాయ్స్ కూడా విస్తుపోయారు. మొదట్లో సారా అలీ ఖాన్ తో క్లోజ్ గా ఉన్న కార్తీక్ ఇపుడు అనన్య పాండేతో డేటింగ్ చేస్తున్నాడనే వార్త హాట్ టాపిక్ గా మారింది. 


కార్తీక్ ఆర్యన్ నిన్నటి వరకు ali KHAN' target='_blank' title='సారా అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సారా అలీఖాన్ తో డేటింగ్ లో ఉన్నాడని ప్రచారం జరిగింది. సారా స్టెప్ మదర్ కరీనా కపూర్ టాక్ షోలో కార్తీక్ మెరవడంతో ఇతను పటౌడీ కాందాస్ కి అల్లుడైపోయాడనే కామెంట్స్ వచ్చాయి. అయితే కెరీర్ డిస్ట్రబ్ అవుతుందని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దామని చెప్పింది సారా. ఈ హీరోయిన్ ఇచ్చిన ఈ గ్యాప్ లో అనన్య పాండేని పడేశాడట కార్తీక్. 


కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే ఇద్దరూ పతి పత్నీ ఔర్ ఓ సినిమాలో నటించారు. ఈ సెట్స్ లోనే అనన్యని పడేశాడట కార్తీక్. రీసెంట్ గా ఈ డేటింగ్ మేటర్ లో నిజమెంత అని కార్తీక్ ని అడిగారు ముంబై జర్నలిస్ట్ లు. దీనికి నా పర్సనల్స్ గురించి మాట్లాడను.. సినిమాల గురించి అడగండి చెబుతా అని ఓ కథ చెప్పి వెళ్లిపోయాడు కార్తీక్. దీంతో ఈడు మాములోడు కాదని మాట్లాడుకుంటోంది బాలీవుడ్. మొత్తానికి కార్తీక్  ఆర్యన్ కు అమ్మాయిల ఫాలోయింగ్ బాగానే ఉంది. ఈ విషయాన్ని చూసిన బాలీవుడ్ అతనికి అది ఓ లక్ అంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: