టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ డి రామానాయుడు తనయుడు వెంకటేష్ కలియుగ పాండవులు మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు.  ఆ తర్వాత యాక్షన్, ఫ్యామిలీ తరహా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు.  గత కొంత కాలంగా వెంకటేశ్ ఎక్కువగా మల్టీస్టారర్ మూవీస్ లో నటిస్తున్నారు.  ఈ సంవత్సరం అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2 ’ మూవీతో మంచి విజయం అందుకున్నాడు వెంకటేశ్.  ఇక అక్కినేని నాగార్జన తనయుడు అక్కినేని నాగ చైతన్య ‘జోష్’ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు.   తర్వాత వచ్చిన ‘ఎం మాయచేసావే’ మూవీతో మంచి విజయం అందుకున్నాడు.  చైతూ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతుంది.  

 

కాకపోతే చెప్పుకోదగ్గ సూపర్ హిట్ మాత్రం లేదు. రీయల్ లైఫ్ లో వెంకటేశ్ మేనళ్లుడు నాగ చైతన్య.  వెంకటేష్ సోదరిని నాగార్జున వివాహం చేసుకొని కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు.  వీరిద్దరి సంతానమే నాగ చైతన్య.  అయితే పుట్టినప్పటి నుంచి యుక్త వయసు వచ్చేవరకు మేనమామల వద్ద పెరిగాడు నాగచైతన్య.  రియల్ లైఫ్‌లోనే కాదు.. తొలిసారి రీల్ లైఫ్‌లోనూ మామా అల్లుళ్లుగా కనిపించబోతున్నారు. కే.ఎస్ రవి చంద్ర  (బాబి) దర్శకత్వంలో వెంకటేష్ - నాగ చైతన్య కలిసిన నటిస్తున్న ‘వెంకిమామ’ డిసెంబర్ 13 న వస్తున్నారు. ‘వెంకీమామ’ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి.

 

ఇప్పటికే మూవీ టీజర్‌ను విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే, సందర్భానుసారంగా సినిమా పోస్టర్లను కూడా వదులుతున్నారు. మరోవైపు, లిరికల్ వీడియోలకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. వెంకటేష్, నాగచైతన్య కలిసి ఉన్న పోస్టర్‌ పంచెకట్టుతో ఇరగదీశారు. ఆ మద్య నాగచైతన్య ఆర్మీమాన్ గా అదరగొట్టాడు. రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించారు. అయితే సినిమా విడుదలపై రకరకాల రూమర్లు ఇప్పటికే సర్క్యులేట్ అయ్యాయి. వాటన్నింటికి పులిస్టాప్ పెడుతూ..వెంక‌టేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 13న‌ సినిమాను విడుద‌ల చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: