హీరోయిన్ సమంత ఆ వార్తను కన్ఫార్మ్ చేసింది. అక్కినేని కోడలు ట్రెండ్ ను ఫాలో అవుతోంది. అందులో భాగంగానే సామ్ న్యూ టర్న్ తీసుకుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే సమంత మరోవైపు ఫోకస్ చేస్తోంది. ఇంతకీ సామ్ కన్ఫార్మ్ చేసిందేమిటి?  ఈ బ్యూటీ ఫాలో అవుతున్న ట్రెండ్ ఏంటో ఓ సారి చూద్దాం.. !


ఆఫ్టర్ మ్యారేజ్ కూడా సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. పెళ్లితో  ఈ చెన్నై బ్యూటీకి ఛాన్స్ లు తగ్గుతాయో అనుకుంటే అందుకు రివర్స్ లో సమంత దూసుకుపోతోంది. సెలక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటూ వరుసగా విజయాలు అందుకుంది. ఈ ఏడాది సమంత ఓ బేబీ, మజిలీ సినిమాలతో మరో రెండు సక్సెస్ లను ఖాతాలో వేసుకుంది. మజిలీ తర్వాత మరో సినిమాకు సైన్ చేయని సామ్ ఇపుడు కొత్త ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 


సమంత ప్రస్తుతం ది ఫ్యామిలీ మేన్ సీజన్ 2 అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషించబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా సమంత ప్రకటించింది. ఇటీవల వచ్చిన ది ఫ్యామిలీ మన్ అనే వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్ దాదాపు అన్ని భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. దీంతో నెటిజన్లు సామ్ నటిస్తున్నది ఫ్యామిలీ మేన్ సీజన్ 2 వెబ్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 


మొదటి సీజన్ లో మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణిలు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు రెండో సీజన్ లో సమంత నటించబోతుండటంతో ఈ వెబ్ సిరీస్ కు మరింత క్రేజ్ వస్తోంది. కొత్త సినిమాలేవి లేకపోవడంతో సామ్ వెబ్ సిరీస్ లపై దృష్టిపెడుతోంది. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ప్రస్తుతం వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తోంది. దీంతో సమంత లాంటి సీనియర్ స్టార్ హీరోయిన్స్ సైతం వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు ఆసక్తి  చూపుతున్నారు. 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: