దేశంలో మహిళల మీద జరుగుతున్న అఘాత్యాలు .. అత్యాచారాలు ప్రజల్లో ఎక్కడ లేని కోపాన్ని తెప్పిస్తుంది. సినిమా వాళ్ళు కూడా వీటిని తీవ్రంగా ఖండించారు. తాజాగా దిశ ఘటనలో పలువురు సినీ ప్రముఖులు తమ బాధను వ్యక్తపరిచారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా యావత్ భారతావని గొంతెత్తుతోంది. దిశ దారుణ హ్యతకు నిరసనగా ప్రజలంతా రోడ్లపైకి ఎక్కారు. ఈ ఘటనకు కారణమైన నిందితులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి లోకం, మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఇలా సమాజం మొత్తం ఒక్కతాటిపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తూ దోషులను వెంటనే శిక్షించాలని కోరుతున్నారు.

నిర్భయ కేసు తరువాత దేశం మొత్తం ఆగ్రహాన్ని తెప్పించిన ఘటనగా చెప్పొచ్చు. హైదరాబాద్ నగర శివారులో జరిగిన ఈ ఘటన.. దేశం మొత్తం ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటనను బాలీవుడ్ ప్రముఖులు సైతం ఖండించారు. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ ఈ ఘటనను ఖండిస్తూ.. వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. మనిషి రూపంలో ఉన్న ఈ రాక్షసులే అత్యంత హేయనీయం. అమాయకులైన నిర్భయ, ప్రియాంక రెడ్డి.. వారు పడిన బాధ, వారి మరణం లాంటి ఘటనలతోనైనా సమాజం ఒక్కతాటిపైకి వచ్చి.. మరో అమాయకురాలు బలికాక ముందే అలాంటి రాక్షసులను అంతం చేయాలంటూ ఎంతో ఉద్వేగ పూరితంగా సల్మాన్ ట్వీట్ చేశాడు.

అయితే ఎప్పుడో కొన్నేళ్ల క్రితం అమితాబ్ చెప్పిన మాటలు .. అత్యాచారం తప్పదనుకున్నప్పుడు వెనక్కి పడుకుని ఎంజాయ్ చేయండి అంటూ అమితాబ్ పాత వ్యాఖ్యలు ప్రస్తుతం తెర పైకి వచ్చాయి. అప్పటి న్యూస్ను రీ ట్వీట్ చేస్తూ..సూపర్ స్టార్స్ ఇలా చెప్తుంటే ఇక అత్యాచారాలు ఎలా ఆగుతాయంటూ మండిపడుతోంది యువత. 30 ఏళ్ళ కిందట ‘మూవీ' అనే మ్యాగజైన్ మీద అమితాబ్ అన్న మాటలు ముద్రించారు. ఇంతకీ ఆయనేమన్నాడంటే..అత్యాచారం తప్పదనప్పుడు.. వెనక్కి పడుకొని దాన్ని ఎంజాయ్‌ చేయటమే అంటూ అమితాబ్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన్ను ప్రస్తుతం వెంటాడుతున్నాయి. మరి వీటిపై అమితాబ్ రియాక్ట్ అవుతాడో లేదో చూడాలి.


 

మరింత సమాచారం తెలుసుకోండి: