సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌ చిత్రాలతో దూసుకెళ్తున్న ప్రభాస్‌ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఆసియా అందగాళ్ల జాబితాలో ప్రభాస్ చోటు సంపాదించాడు. ఇంతకీ డార్లింగ్ ర్యాంక్ ఎంతో తెలుసా? 

 

మన తెలుగు హీరోల్లో ఎవరికీ దక్కని స్టార్ డమ్ ప్రభాస్‌కు దక్కింది. బాహుబలి చిత్రాలు హిట్ కావడం, విదేశీ భాషల్లోకి డబ్ కావడంతో ప్రభాస్‌ పేరు ప్రపంచం అంతటా మార్మోగిపోయింది. అందుకు తగ్గట్టుగానే మరో ఘనత డార్లింగ్ ఖాతాలో వచ్చి పడింది. 

 

ఆసియా సెక్సీయెస్ట్‌ పురుషుల జాబితాలో ప్రభాస్‌ 10వ స్థానం కైవసం చేసుకున్నాడు. ఈ జాబితాలో దక్షిణాది నుంచి చోటు దక్కించుకున్న నటుడు ప్రభాస్‌ మాత్రమే కావడం విశేషం. ఇటీవల బ్రిటీష్‌ న్యూస్‌ వీక్లీ, ఈస్ట్రన్‌ ఐ సంస్థలు సంయుక్తంగా 'సెక్సీయెస్ట్‌ ఆసియన్‌ మ్యాన్‌ ఆఫ్ 2019' సర్వేను నిర్వహించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆన్‌లైన్‌లో ఓట్లు వేశారు. ఓట్ల ఆధారంగా చేసుకుని ఈ సర్వేను చేపట్టారు. దీనికి  సంబంధించిన జాబితాను న్యూస్ వీక్లీ...ఈస్ట్రన్ సంస్థలు లండన్‌లో విడుదల చేశాయి. అయితే ఈ జాబితాలో బాలీవుడ్‌ నటుడు హృతిక్ రోషన్‌ మొదటి స్థానంలో నిలిచాడు. టాలీవుడ్ నటుడు ప్రభాస్‌ పదో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. 

 

రాజమౌళి దర్శకత్వం వహించిన 'బాహుబలి' చిత్రంతో ప్రభాస్‌ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇదే మన డార్లింగ్‌ని సెక్సీయెస్ట్ ఆసియన్ మ్యాన్ ఆఫ్ 2019గా నిలిచేలా చేశాయి. ప్రభాస్ సినీ కెరీర్ ను రెండు భాగాలుగా విభజించవచ్చు. అది బాహుబలి ముందు.. బాహుబలి తర్వాత అని. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి మూవీతో ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రభాస్ చాలామందికి అభిమాన హీరో అయ్యాడు. అంతేకాదు ఆ డార్లింగ్ యూత్ ఐకాన్ గా నిలిచాడు. ఇపుడు ఆసియాలోనే సెక్సీయెస్ట్ మెన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడంతో డార్లింగ్ క్రేజ్ మరింత పెరగనుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: