గతంలో ఒక సెలెబ్రెటీ స్థాయి అతడి సామర్ధ్యం వలన కాని లేదంటే అతడి వ్యక్తిత్వం బట్టి కానీ ఆ సెలెబ్రెటీకి గౌరవం దక్కేది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో ఒక సెలెబ్రెటీ యొక్క స్థాయి యూట్యూబ్ లో ఆ వ్యక్తికి వచ్చే హిట్స్ బట్టి నిర్ణయిస్తున్నారు. ఈ నేపధ్యంలో యూట్యూబ్ సినిమా సెలెబ్రెటీల భవిష్యత్ ను నిర్ణయించే కీలక శక్తిగా మారిపోయింది.   

ప్రస్తుతం పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకు వాటి క్రేజ్ ను యూట్యూబ్ లో వచ్చే వ్యూస్ ను బట్టి అంచనాలు వేస్తున్నారు. దీనితో ఈ యూట్యూబ్ వ్యూస్ రికార్డులకోసం హీరోలు వారి అభిమానులు పరుగులు తీస్తున్నారు. 


గతంలో ఒక మిలియన్ హిట్స్ గొప్ప అనుకుంటే తర్వాత 10 మిలియన్లు గొప్పగా మారింది ఇప్పుడు 100 మిలియన్స్ గొప్ప. ఇక రేపటి రోజున స్టార్ హీరోల సినిమాలకు 1000 మిలియన్స్ వ్యూస్ వస్తే కాని పట్టించుకోని స్థితి. ఈ మ్యానియాతో పెరిగిపోయిన తారల పారితోషికంతో పాటు నిర్మాతలకు యూట్యూబ్ హిట్స్ కు సంబంధించిన ఖర్చులు కూడ బాగా పెరిగి పోయాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఈమధ్య రిలీజ్ అయిన రిలీజ్ కాబోయే సినిమాల టీజర్ పాటలకు యూట్యూబ్ ప్రమోషన్ కు పెట్టిన ఖర్చు గురించి కొన్ని లెక్కలు బయటకు వస్తున్నాయి. ఆలెక్కలు ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇస్తున్నట్లు సమాచారం. ‘సాహో’ కోసం కోటి రూపాయలు ఖర్చు పెడితే ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ ప్రమోషన్ కు  45 లక్షలు ‘అల వైకుంఠపురములో’ పాటకు 23 లక్షలు ‘రూలర్’ టీజర్ కు 14 లక్షలు ‘ప్రతిరోజూ పండగే’  పాటకు 11 లక్షలు ఖర్చు పెట్టారు అని వస్తున్న వార్తలు వింటూ ఉంటే రానున్న రోజులలో ఈ యూట్యూబ్ ప్రమోషన్ మ్యానియాకు రానున్న రోజులలో కోట్లు ఖర్చుపెట్టినా సరిపోదు అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన చెందుతున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: