ఆర్ ఎక్స్ 100 సినిమాతో కుర్ర‌కారు గుండెల‌ను కొల్ల‌గొట్టిన బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్ మ‌రోమారు త‌న వ‌య్యారాల‌తో వారి మ‌న‌సు దోచుకునేందుకు  వెంకీమామ సినిమాతో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ మూవీ డిసెంబర్ 13 న విడుద‌ల చేస్తున్న‌ట్లు ఇప్ప‌టికే చిత్ర‌వ‌ర్గాలు అనౌన్స్ కూడా చేసేశాయి. దీంతో రాజ్‌పుత్ అందాల‌ను వీక్షించేందుకు కుర్ర‌కారు ఇగ‌ర్‌గా వెయిట్ చేస్తోందంట‌. ఇదిలా ఉండ‌గా డిసెంబ‌ర్ 5 రాజ్‌పుత్ పుట్టిన రోజు కావ‌డంతో ఈ హాట్ హీరోయిన్  బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు సంబంధించిన ఓ హాట్ హాట్ ఫొటో పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో పాయ‌ల్ చీర‌క‌ట్టులో ఉంటుంది.



అయితే వ‌య్యారాల‌ను ఒల‌క‌బొస్తున్న‌ట్లు ఉండే ఈ ఫొటోను చూస్తుంటే యువ‌కుల‌కు మ‌త్తు తెప్పించేలా ఉండ‌టం గ‌మ‌నార్హం.  పోస్టర్ లో పాయల్ చీర కట్టులోటెంప్ట్ చేసేలా కనిపిస్తోంది.  ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. రాజ్‌పుత్ పాయ‌ల్ గురువారం సినిమా న‌టీన‌టుల మ‌ధ్య పుట్టిన రోజు వేడుక‌ల‌ను జ‌రుపుకున్నారు. ఈ ఫొటోల‌ను త‌న ఇన్‌స్ట్రాగ్రాంలో పోస్ట్ చేసి త‌న అభిమానుల‌తో ఆనందాన్ని పంచుకున్నారు.


వెంకీమామ సినిమాలో వెంక‌టేష్ స‌ర‌స‌న పాయ‌ల్ న‌టిస్తోంది. మ‌ల్టీస్టార‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈసినిమాలో వెంక‌టేష్‌తో పాటు నాగ‌చైత‌న్య న‌టిస్తున్నారు. నాగ‌చైత‌న్య ఆర్మీ మేజ‌ర్‌గా పాత్ర పోషిస్తుండ‌గా..వెంక‌టేష్ రైస్ మిల్ల‌ర్స్ ఓన‌ర్‌గా పాత్ర చేస్తున్నాడ‌ట‌. బాబీ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. బాబీ గ‌తంలో రవితేజతో 'పవర్', పవన్ కళ్యాణ్ తో 'సర్దార్ గబ్బర్ సింగ్', ఎన్టీఆర్ తో 'జై లవ కుశ' సినిమాలకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.



కుటుంబ నేప‌థ్యంలోనే ఈ సినిమా క‌థాంశం ఉంటుంద‌ని చిత్ర‌వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్తో తెర‌కెక్కిన  ఎఫ్‌2 గ‌త సంవ‌త్స‌రం మంచి వ‌సూళ్లు సాధించి వెంక‌టేశ్ కెరీర్‌కు బూస్టింగ్ ఇచ్చింది. ఆ సినిమాలో వెంక‌టేష్ స‌హ హీరోగా వ‌రుణ్‌తేజ్ న‌టించ‌గా ఇక వెంకిమామ సినిమాలో నాగ‌చైత‌న్య న‌టిస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ను ఏ  మేర‌కు మెప్పిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: