నందమూరి బాలకృష్ణ వందవ సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ తర్వాత జోరు పెంచారు. వరుసగా సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు సవాల్ విసురుతున్నారు. అయితే క్రిష్ దర్శకత్వంలో ఆయన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్ బయోపిక్’ తెరకెక్కించారు. కథానాయకుడు, మహానాయకుడు ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డాయి. దాంతో బాలకృష్ణ ఆలోచనలో పడ్డారు. ఇక ఏపి, తెలంగాణలో ఎన్నికలు రావడంతో ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు బాలకృష్ణ. హిందూపురం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా నిలబడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మళ్లీ మూవీస్ పై ఫోకస్ పెట్టడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తున్న ‘రూరల్ ’ మూవీలో నటిస్తున్నారు.
ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్, టీజర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ సినిమాను ఈనెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇక ఈనెల 14న వైజాగ్ ఎంజిఎం గ్రౌండ్స్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలో సినిమా యూనిట్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ఈ మూవీలో రెండు పవర్ఫుల్ షేడ్స్‌లో బాలకృష్ణ నటిస్తున్నారు. ‘జై సింహా’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత కె.ఎస్.రవికుమార్, సి.కల్యాణ్ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు.
మూవీలో ప్రకాష్‌రాజ్, భూమిక, జయసుధ, షాయాజీ షిండే, ధన్‌రాజ్, కారుమంచి రఘు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీః సి.రాంప్రసాద్, మ్యూజిక్ : చిరంతన్ భట్, కథ : పరుచూరి మురళి, ఆర్ట్ : చిన్నా, పాటలుః రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, ఫైట్స్ : రామ్-, లక్ష్మణ్, అన్బు, అరివు, కొరియోగ్రఫీ : జానీ మాస్టర్. ఈ సినిమా బాలయ్య కెరీర్ లో మరో హిట్ మూవీగా ఉండబోతుందని అంటున్నారు.