నవంబర్ 27 వ తేదీన దిశపై అత్యాచారం, హత్య తరువాత దేశం యావత్తు ఒక్కసారిగా అట్టుడికిపోయింది.  ఈ ఘటనపై ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు.  ఆందోళల చేశారు.  నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు.  కాగా, ఈరోజు ఉదయం నిందితులను పోలీసులు చటాన్ పల్లి అండర్ పాస్ వద్ద ఎన్ కౌంటర్ చేశారు. సీన్ రికన్ స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిపై కాల్పులు జరిపారు.  ఈ కాల్పుల్లో నలుగురు నిందితులు మరణించారు.  


కాగా, నిందితుల ఎన్ కౌంటర్ పై రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు స్పందించారు.  పోలీసులు స్పందించిన విధానం బాగుందని, భగంవతుడు పోలీసుల రూపంలో వచ్చి ఈ ఎన్ కౌంటర్ చేశారని.  ఇది చూసైనా మళ్లీ ఎవరైనా ఇలాంటి పనులు చేయాలంటే భయపడాలి. ఈ నలుగురి ఎన్‌కౌంటర్‌తో ఒక ఆడబిడ్డకు న్యాయం జరిగిందన్నారు. అలాగే దిశ ఆత్మకు శాంతి కలగాలి అని కోరుకుంటున్నాను. ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యేలా చేసిన తెలంగాణ ప్రభుత్వానికి మరియు తెలంగాణ పోలీసులకు  అభినందనలు అని బాలకృష్ణ పేర్కొన్నారు.  


ఈరోజు బాలకృష్ణ 106 వ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.  బోయపాటి దర్శకత్వంలో  ఈ సినిమా ప్రారంభం అయ్యింది.  జనవరి నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.  ఈనెల 20  తేదీన బాలయ్య రూలర్ సినిమా రిలీజ్ కాబోతున్నది.  సినిమా రిలీజ్  కు సంబంధించి అన్ని  ఏర్పాట్లు చేస్తున్నారు. రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 14 వ తేదీన విశాఖలో నిర్వహించబోతున్నారు.  


ఇక దిశ అత్యాచారం, హత్య కేసు తీసుకుంటే, నవంబర్ 27 వ తేదీ రాత్రి 9:30 గంటల గంటల సమయంలో మహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు దిశను ఎత్తుకెళ్ళి అత్యాచారం హత్య చేశారు.  నిందితులను 48 గంటలలో పట్టుకున్నారు.  కేసు విచారణ చేస్తున్నారు.  నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని, ఎన్ కౌంటర్ చేయాలని ప్రజలు ఆందోళన చేసిన సంగతి తెల్సిందే.  ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడం, నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించడంతో ఈ ఎన్ కౌంటర్ జరిగింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: