మాస్ మహరాజ్ రవితేజ రాజా ది గ్రేట్ తర్వాత వరుసగా మూడు ఫ్లాపులు ఎదుర్కున్నాడు. అమర్ అక్బర్ ఆంటోని తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన రవితేజ వి.ఐ.ఆనంద్ డైరక్షన్ లో డిస్కో రాజా సినిమా చేశాడు. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను రాం తాళ్లూరి నిర్మిస్తున్నారు. 2020 జనవరి 24న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమాకు సంబందించిన టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది.

 

టీజర్ తో సర్ ప్రైజ్ చేసిన రవితేజ తన గురించి లైట్ తీసుకునే వారికి వార్నింగ్ ఇచ్చినట్టు ఉంది. నో రికార్డ్స్.. జీరో రిస్క్ అంటూ చెప్పే డైలాగ్ తనతో పోటీ వస్తే తేడా వస్తదని చెప్పినట్టే ఉంది. ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతో దర్శకుడిగా సూపర్ హిట్ అందుకున్న వి.ఐ.ఆనంద్ ఆ తర్వాత చేసిన ఒక్క క్షణం పెద్దగా మెప్పించకపోయినా డిస్కో రాజాతో మాత్రం హిట్టు కొట్టేలా ఉన్నాడు. 

 

టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. రవితేజ తప్పకుండా ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేలా ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమాలో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాలో రవితేజ డిఫరెంట్ క్యారక్టర్స్ లో కనిపించనున్నాడు. మాస్ మజరాజ్ రవితేజ ఈ సినిమాపై చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు.

 

కొంతకాలంగా రవితేజ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు ఇవ్వడం లేదు. రాజా ది గ్రేట్ హిట్టైనా ఆ సినిమాకు ముందు రెండేళ్లు సినిమాలు చేయలేదు. మరి డిస్కో రాజా సినిమాతో మళ్లీ రవితేజ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి. యువ హీరోలు డిఫరెంట్ స్టోరీస్ తో వరుస హిట్లు కొడుతుంటే రవితేజ మాత్రం కెరియర్ పరంగా చాలా వెనుకపడ్డాడు. మరి రవితేజ డిస్కో రాజా అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: