ఆర్ ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన హీరో కార్తికేయ గుమ్మకొండ. అంతకముందు ప్రేమతో మీ కార్తీక్ తీసినప్పటికి ఆ సినిమా ఎవరికి తెలీదు. కానీ ఆర్ ఎక్స్ 100 సినిమా మాత్రం అతనికి యూత్ లో భారీ క్రేజ్ ని తెచ్చిపెట్టింది. అయితే ఆ క్రేజ్ కాస్త ఆ తరువాత వచ్చిన హిప్పీ- గుణ 369 చిత్రాలు నిలబెట్టలేకపోయాయి. మొత్తంగా ఈ కుర్ర హీరో ఇమేజ్ ని కిందకు లాగేశాయి. ఇక నేచురల్ స్టార్ నానీ గ్యాంగ్ లీడర్ లో పోషించిన నెగిటివ్ రోల్ కూడా మన హీరోగారికి వర్కౌట్ అవలేదు. ఇక తాజాగా కార్తికేయ నటించిన చిత్రం 90 ఎంఎల్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాపై యూత్ లో కాస్తో కూస్తో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అయితే ఈ సినిమాకి ఊహించని ప్రమాదం కూడా ఎదురవుతోందని తాజా పరిస్థితులను బట్టి తెలుస్తోంది. 

 

ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కు ఓ విచిత్రమైన జబ్బు వుంటుందట. రోజు 90 ఎంఎల్ తాగితేనే హీరో గారు బ్రతుకుతాడని డాక్టర్లు చెప్పడంతో మద్యం కాస్తా పిల్లాడికి పాల సీసాలా మారుతుందట. ఇదే ఇప్పుడు ఈ సినిమాకు చిక్కులు తెచ్చిపెట్టబోతోంది. ఈ సినిమా మద్యపానాన్ని ప్రేరేపించే విధంగా వుందని.. ఇలాంటి సినిమాల వల్లే నేటి యువత తప్పుదారి పడుతున్నారని మహిళా సంఘాలు చిత్ర బృందాన్ని హెచ్చరిస్తున్నాయి.

 

ఈ శుక్రవారం రిలీజవుతున్న 90 ఎంఎల్ సినిమాని అడ్డుకుంటామని.. ప్రసాద్స్ ఐమాక్స్ వద్ద తమ నిరసన తెలియజేస్తామని పలు మహిళా సంఘాలు ఇప్పటికే చిత్ర బృందానికి వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది. ఇకపోతే ఏపీలో దపదఫాలుగా మద్యాన్ని తగ్గిస్తూ చివరికి నిషేధించాలన్న పట్టుదలతో ఉన్నారు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఈ సినిమాపై రియాక్షన్ ఎలా ఉంటుందోనన్న చర్చా వేడెక్కిస్తోంది. సంఘంలో చెడు అలవాట్లను తగ్గించేందుకు ప్రయత్నించాలి కానీ.. పెంచేదిగా ఉంటే అలాంటి సినిమాలకు ఇలాంటి తీవ్ర పరిణామాలు తప్పవు మరి.  

మరింత సమాచారం తెలుసుకోండి: