హైదరాబాద్ శివారులో వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దిశను హత్య చేసిన నింధితులను ఈ రోజు ఎన్ కౌంటర్ కి చేశారు తెలంగాణ పోలీసులు.  దిశ మరణం తర్వాత ఒక అమాయకురాలిని అత్యంత కిరాతంగా అత్యాచారం చేసి హత్య చేయడంపై ప్రతి ఒక్కరూ చలించిపోయారు. ఈ నేపథ్యంలో దోషులను నడిరోడ్డుపై ఉరితీయాలని డిమాండ్ చేశారు.  సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు.. పార్లమెంట్ లో సైతం దుమ్మెత్తి పోశారు.  ఈ ఉదయం నలుగురు నింధితులను ఎన్ కౌంటర్ చేశారు. దేశ వ్యాప్తంగా దిశా అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ పై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

 

ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా తెలంగాణ పోలీసుల పనితీరును మెచ్చుకుంటున్నారు.  తాజాగా ఈ ఘటనపై  వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించారు. తాను గౌరవించదగిన అమ్మాయిని కాకపోయినా, తాను మాట్లాడే అంశం మాత్రం గౌరవించదగినది చెప్పి మరీ మగ మృగాలపై విరుచుకుపడ్డారు.  ఇక ఎప్పటిలాగే తన కౌంటర్లు మొదటు పెట్టింది.  ఈ ఘటనను కూడా పవన్ లింక్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. పవన్ కళ్యాణ్ మాదిరి మూడు, నాలుగు సార్లు పెళ్లిళ్లు చేసుకుంటున్న వారిని కూడా ఎన్ కౌంటర్  చేసి చంపేయాలని ఏపీ పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నట్లు తన సోషల్ మీడియా పేజ్ లో రాసుకొచ్చింది.

 

ఆ మద్య శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్న సమయంలో పవన్ కళ్యాన్ తనకు మద్దతు ఇవ్వలేదని అప్పటి నుంచి ప్రతి చిన్న విషయంపై పవన్ ని విమర్శించడం.. తర్వాత పవన్ ఫ్యాన్స్ శ్రీరెడ్డిని ట్రోల్ చేయడం కామన్ అయ్యింది. తాజాగా ఇలాంటి ఘటనతో అత్యాచారం చేయాలనున్న వాళ్ల ఒంట్లో వణుకు పుట్టేలా చేసారన్నారు. తర్వాత షరా మూమూలుగానే మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న పీకే లాంటి వాళ్లను కూడా తెలంగాణ పోలీసుల మాదిరే ఏపీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేయాలని సంచలన పోస్ట్ చేసింది.  అయితే ఇందులో పీకే అంటూ పెట్టడం ఇప్పుడు వివాదాన్ని సృష్టిస్తుంది.  పీకే అంటూ చెప్పినా.. అది పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేసిందే అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: