బుల్లితెర పై ఎప్పుడు ప్రజలకు దగ్గరగా ఉంది అలరిస్తూ వస్తున్నా యాంకర్లలో రవి కూడా ఒకరు. ఈయన చాలా షో లలో ప్రేక్షకుల ఆకట్టుకుంటూవస్తున్నారు. అలా ఎన్నో షో లలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఎంత ఫెమస్ నో అంతకు మించిన విధంగా రోజుకో వార్తతో వార్తల్లో నిలుస్తున్నారు. అలా కంట్రీవెర్సిలతో ఫెమస్ అవుతున్నాడు. ఇకపోతే షో లతో బిజీగా ఉన్నాడు. 

 

యాంకర్ రవి గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తూనే ఉంటాయి. ఈయన ఎప్పుడూ రూమర్స్‌కు చాలా దగ్గరగా ఉంటాడు. అలాంటి రవి కొన్ని రోజులుగా తన పని తాను చూసుకుంటున్నాడు.. చేసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు మళ్లీ చాలా రోజుల తర్వాత మనోడు ఫామ్‌లోకి వచ్చాడు. 

 

ఎందుకో తెలియదు కానీ తాజాగా లోకల్ గ్యాంగ్స్ ప్రోమోలో అదిరిపోయే సెటైర్ ఒకటి వేసాడు. ఈటీవీలో పటాస్ షో చేస్తూనే జీ తెలుగుకు వచ్చాడు రవి. అక్కడ అనసూయ, ప్రదీప్ లాంటి వాళ్ళతో కలిసి లోకల్ గ్యాంగ్స్ షో చేస్తున్నాడు. ఇందులో నాగబాబు కూడా అప్పుడప్పుడూ వస్తుంటాడు. జబర్దస్త్ డైరెక్టర్స్ నితిన్ భరత్ ఈ కాన్సెప్ట్ రూపొందించారు.

 

ఈయన మామూలుగానే మాట్లాడినా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఈ డైలాగ్ మరోలా ట్రెండ్ అవుతుంది. రవి గతంలో శ్రీముఖి, లాస్య లాంటి యాంకర్స్‌తో కలిసి పని చేసాడు. అందులో లాస్యతో ఈయనకు రిలేషన్ బాగానే ఉండేది. అయితే ఉన్నట్లుండి రవిని తిట్టడం.. పెళ్లి చేసుకోవడం అన్నీ జరిగిపోయాయి. ఇక శ్రీముఖి కూడా ఈ మధ్యే బిగ్ బాస్‌లో తన లవ్ స్టోరీ చెప్పింది. అందులో హీరో కమ్ విలన్ రవి అంటూ సోషల్ మీడియాలో అప్పట్లో పోస్టులు కూడా బాగానే వచ్చాయి.

 

మరో విషమేంటంటే..  రవితో కలిసి పని చేయడానికి నాన్న పర్మిషన్ కావాలంటూ శ్రీముఖి చెప్పడం కూడా సంచలనమే. ఇవన్నీ ఇలా ఉన్న తరుణంలో తనను మోసం చేసి మరొకర్ని పెళ్లి చేసుకున్నందుకు అది ఏడుస్తుందంటూ స్కిట్‌లో రవి చెప్పినా కూడా బయట జనం మాత్రం మరోలా కనెక్ట్ అవుతున్నారు. దీన్ని బట్టి చూస్తే శ్రీముఖి లవరా అనే అనుమానాలు మొదలైయ్యాయి.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: