టాలీవుడ్, కోలీవుడ్ లో ఒకప్పుడు తన హాట్ అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టిన నటి కస్తూరి.  కన్నడ భాషలో కూడా కొన్ని సినిమాల్లో నటించింది కస్తూరి.  కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నా తన సంచలన కామెంట్స్ తో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అప్పట్లో అక్కినేని నాగార్జున నటించిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్‌లో ‘అన్నమయ్య’ ఒకటి. టాలీవుడ్ మన్మథుడిగా ముద్రపడిన నాగార్జున... శ్రీవెంకటేశ్వరుడి భక్తుడు అన్నమయ్యగా అద్భుతంగా నటించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అంతకు ముందు నందమూరి బాలకృష్ణతో ‘నిప్పురవ్వ’, మోహన్‌బాబుతో ‘సోగ్గాడి పెళ్లాం’ వంటి సినిమాల్లో కనిపించి, అందాలతో అల్లరి చేసిన కస్తూరి... ఇప్పటికీ తమిళ్‌లో ఆడపా దడపా సినిమాల్లో నటిస్తూ కెరీర్ కొనసాగిస్తోంది. ఆ మద్య  తాను చూసిన షోలలో అత్యంత చెత్త షో బిగ్ బాస్ అని నటి కస్తూరి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.  

 

తమిళ బిగ్ బాస్ మూడవ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి అంతే త్వరగా బయటకి వచ్చేసింది కస్తూరి. అప్పట్లో కస్తూరి వ్యాఖ్యలపై బిగ్ బాస్ పై ఎన్నో కామెంట్స్ వచ్చాయి.  ఇక నిన్న వెటర్నరీ డాక్టర్ దిశ ను అత్యంత కృరంగా అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నింధితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పోలీసులను ప్రశంసిస్తూ.. పండుగ వాతావరణం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ సంఘటనపై సెలెబ్రిటీలు వరుసగా స్పందిస్తున్నారు. ఎన్ కౌంటర్ పై సినీ రాజకీయ ప్రముఖులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.  కానీ కస్తూరి మాత్రం పరోక్షంగా పోలీసులని అభినందిస్తూ ట్వీట్ చేసింది.

 

 'హైదరాబాద్ పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. దిశ కేసులో నిందితులని ఎన్ కౌంటర్ చేశారు. పోలీసులపై ఖఠినమైన చర్యలు తీసుకోవాలి.. వారిని వెంటనే ఉత్తరప్రదేశ్ లోని 'ఉన్నావ్', తమిళనాడులోని పొల్లాచ్చి ప్రాంతాలకు బదిలీ చేయాలి' అని  కస్తూరి ట్వీట్ చేసింది. అలా అని  ఆమె తెలంగాణ పోలీసులకు వ్యతిరేకంగా కామెంట్స్ చేయలేదు. హైదరాబాద్ పోలీసులు మంచి పని చేశారని.. వారిని ఉన్నావ్, పొల్లాచ్చి ప్రాంతాలకు బదిలీ చేస్తే బాధితులకు న్యాయం చేస్తారని అర్థం వచ్చేలా కస్తూరి పరోక్షంగా తెలిపారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: