నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న షేడ్స్‌లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య కొత్త లుక్ ఇప్పటికే పలు పోస్టర్ల రూపంలో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య మధ్యవయస్కుడి పాత్రలో ఉండే ఆ గెటప్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


కాగా థాయిలాండ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం బాలయ్, సోనాల్ చౌహాన్‌లపై ఓ సాంగ్ చిత్రీకరిస్తోంది. గతంలోనూ బాలయ్య ఈ పాపతో లెజెండ్, డిక్టేటర్ సినిమాల్లో ఆడిపాడాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సోనాల్‌తో బాలయ్య రొమాన్స్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మరో హీరోయిన్‌గా వేదిక ఈ సినిమాలో నటిస్తోంది.

 

బాలయ్య కెరీర్‌లో 105వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఇప్పటివరకు టైటిల్ పెట్టలేదు. కాగా ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

ఈ ఏడాది తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ లో నటించారు. రెండు భాగాలుగా వచ్చిన ఈ మూవీస్ ఆడియన్స్ ని నిరాశపరిచాయి. ఈలోగా ఏపిలో ఎన్నికలు రావడం.. ఎమ్మెల్యేగా హిందూపూర్ నుంచి పోటీ చేసి గెలవడం జరిగిపోయింది. తాజాగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న మూవీ `రూల‌ర్‌'. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'జై సింహా' మూవీ తెరకెక్కింది. కాకపోతే ఈ మూవీ ప్రేక్షకులని అంతగా అలరించలేకపోయింది. ఇక రూలర్ సినిమాతో ఫుల్ ఎంటర్‌టైన్ చేయాలని వీరు భావిస్తున్నారు. ఈ నెల 20వ తారీఖున ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రంలో రెండు భిన్న‌మైన పాత్ర‌ల్లో బాల‌య్య క‌నిపించ‌నున్నారు. ఇందులో సోనాలీ చౌహాన్ మ‌రియు వేదిక న‌టిస్తున్నారు. ఇక సోనాల్ ఒక పాట సీక్వెన్స్‌లో సోనాల్ ఈ చిత్రంలో బికినీ వేసుకున్న డ్యాన్స్ ఒక‌టి ఉంద‌ని స‌మాచారం. అయితే ఈ భామ గ‌తంలో కూడా బాల‌య్య తో క‌లిసి లెజెండ్‌, డిక్టేట‌ర్ చిత్రాల్లో కూడా న‌టించింది. డిక్టేట‌ర్ త‌ర్వాత  మ‌ళ్ళీ తిరిగి బాల‌య్య‌తో జ‌త‌క‌ట్ట‌డం అనేది విశేషం. బాల‌య్య వ‌య‌సు ఎక్కువ క‌నిపించ‌డంతో కొత్త హీరోయిన్లు ఎక్కువ‌గా ఇంట్ర‌స్ట్ చూపించ‌డంలేదు. అందుకే కాబోలు నిర్మాత‌లు కూడా మాట్లాడితే బాల‌య్య కోసం సోనాల్ ద‌గ్గ‌రికే వెళుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: